Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓషో తులసీరామ్ తీస్తున్న సాయి ధన్సిక దక్షిణ మోషన్ పోస్టర్

Advertiesment
sai dhansika
, శనివారం, 19 నవంబరు 2022 (18:11 IST)
sai dhansika
'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దక్షిణ'. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు 'మంత్ర', 'మంగళ' తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఆదివారం (నవంబర్ 20న) సాయి ధన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
 
చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ''సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా హీరోయిన్ సాయి ధన్సిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ పేరు చెబితే 'కబాలి' గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెను 'దక్షిణ' ఫేమ్ ధన్సిక అంటారు. ఆవిడ రోల్ అంత పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ సినిమాకు కథ ఎంత హైలైట్ అవుతుందో... సాయి ధన్సిక పర్ఫార్మెన్స్ అంత హైలైట్ అవుతుంది. ఆవిడది ఈ చిత్రంలో హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్. ఇందులో బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్ రోల్ చేస్తున్నారు. ఇదొక సైకో థ్రిల్లర్. తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్నాం. ఆల్రెడీ 70 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. గోవా, హైదరాబాద్ లో షూటింగ్ చేశాం. డిసెంబర్ నెలలో విశాఖలో జరిపే షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. తెలుగులో 'మంత్ర', 'మంగళ' ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాల తరహాలో 'దక్షిణ' ఉంటుంది'' అని చెప్పారు. 
 
సాయి ధన్సిక, రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : నర్సింగ్, సంగీతం : బాలాజీ, నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, దర్శకత్వం : ఓషో తులసీరామ్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్మ, నాకు మధ్య అరమరికలు తొలగాయి అందుకే డేంజరస్ విడుదల : నట్టి కుమార్