Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ' జయలలిత నా సీనియర్.. నేను ఆమె ఒకే స్కూల్లో చదివాం: హీరో సుమన్

తిరిగిరాని లోకాలకు చేరుకున్న ముఖ్యమంత్రి జయలలితో ఉన్న అనుబంధాన్ని, పరిచయాన్ని ప్రతి ఒక్కరూ నెమరు వేసుకుంటున్నారు. ఇందులోభాగంగా టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో సుమన్...జయలలిత మృతి పట్ల తీవ్ర దిగ్భాంతిని వ

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (12:35 IST)
తిరిగిరాని లోకాలకు చేరుకున్న ముఖ్యమంత్రి జయలలితో ఉన్న అనుబంధాన్ని, పరిచయాన్ని ప్రతి ఒక్కరూ నెమరు వేసుకుంటున్నారు. ఇందులోభాగంగా టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో సుమన్...జయలలిత మృతి పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తంచేశారు. 
 
జయలలిత మృతిపై సుమన్ స్పందిస్తూ... హాస్పిటల్ నుంచి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని భావించాం, కానీ ఇలా జరిగటం బాధాకరం అన్నారు. ఆమె, నేను చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్లో చదివాం. నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నపుడు జయలలిత సీనియర్. ఆమె షూటింగ్‌లకు వెళ్ళడం నాకు బాగా గుర్తుంది అని సుమన్ గుర్తుచేసుకున్నారు.
 
నటిగా కంటే మంచి డాన్సర్‌గా జయలలిత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా పాలిటిక్స్‌లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడి జనామోదం పొంది మాస్ లీడర్ అయ్యారు. పేద ప్రజలకు విశేష సేవలందించి అమ్మగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అమ్మ క్యాంటిన్ ఆమెకు పేద ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించి పెట్టింది. అని ఆమె సినీ రాజకీయ ప్రస్థానాలను సుమన్ గుర్తు చేసుకున్నారు.
 
సోదరి జయలలిత మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని సినీనటి జమున అన్నారు. జయలలిత శపథం మంగమ్మ శపథం లాంటిదన్నారు. ఐదు సార్లు సీఎంగా చేసిన మహా నాయకురాలు అని, పేదల హృదయాల్లో అమ్మగా నిలిచిపోయారని కొనియాడారు. జయ టీవీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల అనంతరం ప్రేమగా తమకు జయలలిత వడ్డించారని, కౌగిలించుకుని కొత్త బట్టలు పెట్టి పంపించారని జమున గుర్తు చేసుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments