తమిళనాట అత్యంత ప్రజాధారణ కలిగిన వారిలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత, సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌లు ముందు వరుసలో ఉంటారు. అలాంటి రజినీకాంత్‌పై కూడా జయలలిత ప్రతీకారం తీర్చుకున్నారు.
తమిళనాట అత్యంత ప్రజాధారణ కలిగిన వారిలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత, సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌లు ముందు వరుసలో ఉంటారు. అలాంటి రజినీకాంత్‌పై కూడా జయలలిత ప్రతీకారం తీర్చుకున్నారు. తాము అభిమానించిన, నమ్మిన వారికి బ్రహ్మరథం పడతారనే మాట నమ్మక తప్పలేదు. అభిమానాన్నిమించిన వ్యక్తి పూజకు తమిళ గడ్డ పుట్టింది పేరు. అలా ఒకరికి మించి ఒకరు ప్రజాధారణ కలిగిన జయ, రజినీల ప్రతీకారానికి సంబంధించి ఓ కథ ప్రచారం ఉంది. అదేంటంటే..
చెన్నైకు చెందిన గాయత్రీ శ్రీకాంత్ అనే నేత్రవైద్య నిపుణురాలు "ద నేమ్ ఈజ్ రజినీకాంత్" అనే పుస్తకంలో, వీరిద్దరి గురించి ప్రచారంలో ఉన్న ఓ ఆసక్తికరమైన కథ గురించి వివరించారు. అదేంటంటే, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో - ఒకసారి రజినీకాంత్ తన కారులో వెళ్తుండగా ట్రాఫిక్ ఆగి పోయింది. "ఎందుకు ట్రాఫిక్ ఆగింది? అని రజినీకాంత్ ప్రశ్నించగా! "ముఖ్యమంత్రి జయలలిత ఆ దారిలో వస్తున్నారని, అందుకే ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ ఆపేశారు" అని అక్కడి ట్రాఫిక్ పోలీస్ చెప్పాడు. "ఆమె ఎంతసేపట్లో వస్తారని?" రజినీ ప్రశ్నించగా, "తెలియదని, బహుశా అరగంటలో రావచ్చని" అతడు సమాధానమిచ్చాడు.
మరి "అప్పటిదాకా ట్రాఫిక్‌ను పంపించవచ్చు"గా అని రజినీ అడిగితే - "ట్రాఫిక్ నిలిపివేయాలని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయి" అని అతడు చెప్పాడు. దీంతో రజినీకాంట్ ఒక్క క్షణం ఆలోచించి, కారులోంచి దిగి సమీపంలో ఉన్న ఓ బడ్డీ కొట్టుకెళ్లి సిగరెట్ కొని వెలిగించి, పక్కనే ఉన్న స్థంబానికి ఆనుకుని తీరిగ్గా పొగ తాగడం మొదలుపెట్టారు. సాధారణంగా సీఎం కాన్వాయ్ వస్తుందంటే ఆ మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ, రజినీకాంత్ చర్య వల్ల ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో ముఖ్యమంత్రి జయలలిత కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీనిపై ఆరా తీసిన జయలలిత... తన వల్ల కాన్వాయ్ వల్ల ఎంత మంది బాధపడుతున్నారో స్వయంగా ఆ రోజు గ్రహించారని చెపుతారు. అప్పటి నుంచి తాను వెళ్లే మార్గంలో కొన్ని నిమిషాలకు ముందు మాత్రమే ట్రాఫిక్ నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ విధంగానే ఇప్పటికీ నడుచుకున్నారు అమ్మ.
అంతేనా...1996 ఎన్నికల సమయంలో రజినీకాంత్ ఓ సందర్భంలో మాట్లాడుతూ... మరోమారు "జయలలిత అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు" అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఒకే ఒక్క వ్యాఖ్య ఆ యేడాది జరిగిన ఎన్నికల్లో జయ ప్రత్యర్థులకు ప్రధాన నినాదంగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో జయ ఓడిపోయారు పాపం. అయితే, అదే రజినీకాంత్ 2011లో "జయలలిత విజయం తమిళనాడును కాపాడింది" అని ప్రకటించడం గమనార్హం. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఆతర్వాత నుంచి వారిద్దరూ స్నేహపూరితంగా మెలుగుతూ వచ్చారు.