Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (19:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ యంగ్ హీరోయిన్ "జాతిరత్నాలు" చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. మంచి అంద చందంతో పాటు చూడముచ్చటగా ఉండే ఈ భామకు మాత్రం కాలం కలిసిరావడం లేదు. 'జాతిరత్నాలు' తర్వాత ఆమె కెరీర్‌లో సరైన హిట్ లభించలేదు. వరుస చిత్రాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. తనకంటూ ఓ అవకాశం వస్తే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఏమాత్రం సిగ్గు లేకుండా డేటింగ్ చేస్తానని, ఆ తర్వాత టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునను లవ్ చేసి, టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్‌ను వివాహం చేసుకుని పిల్లలను కంటానని చెప్పారు.  
 
కాగా, ప్రముఖ యాంకర్ సుమ నిర్వహిస్తున్న చాట్ షో లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఫరియా అబ్దుల్లా అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైనశైలిలో వినోదం పంచుతూ సమాధానం ఇచ్చింది. సుమపై ర్యాప్ సాంగ్ పాడి ఆలరించింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై హల్చల్ చేస్తోంది. పూర్తి ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments