Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత యుద్ధనౌకల పేల్చివేతకు జైషే ఉగ్రవాదుల ప్లాన్

భారత యుద్ధ నౌకల పేల్చివేతకు పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మొహ్మద్ సంస్థకు చెందిన ముష్కరులు ప్లాన్ వేసినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ముఖ్యంగా, ఇండియన్ నేవీలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న తూర్పు నౌకాదళం పరి

Webdunia
గురువారం, 19 జులై 2018 (09:27 IST)
భారత యుద్ధ నౌకల పేల్చివేతకు పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మొహ్మద్ సంస్థకు చెందిన ముష్కరులు ప్లాన్ వేసినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ముఖ్యంగా, ఇండియన్ నేవీలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న తూర్పు నౌకాదళం పరిధిలో ఉన్న యుద్ధ నౌకలను పేల్చివేయాలని కుట్ర పన్నినట్టు సమాచారం. ఇందుకోసం ఆ సంస్థ.. కొందరు డీప్‌ సీ డైవర్ల(సముద్ర అంతర్భాగంలోనే దాడిచేయగల నైపుణ్యం కలిగిన శిక్షకులు)కు పాకిస్థాన్‌లో శిక్షణనిచ్చినట్టు గుర్తించారు. 
 
మొత్తం 10 మంది ఉగ్రవాద డైవర్లు శిక్షణ పూర్తి చేసుకుని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ముజఫరాబాద్‌ సమీపంలోని - కెల్‌, ఆత్ముకమ్‌, దుధినిహల్‌, లీపా లోయల గుండా భారత్‌లోకి చొరబడే అవకాశాలున్నట్లు సమాచారమందింది. ముఖ్యంగా, సముద్ర అంతర్భాగంలోకి వెళ్లి దాడులు చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉగ్రవాదులకు జైషే సంస్థ అందించిందట. 
 
ఈ దాడి కూడా పఠాన్‌కోట్‌ దాడి తరహాలోనే నౌకాదళంపై కూడా విరుచుకుపడాలన్నది జైషే, లష్కర్‌ల వ్యూహమని ఈ కేంద్రం వివరించింది. దీనిపై నౌకాదళం అప్రమత్తమయ్యింది. నిఘా పెంచింది. యుద్ధనౌకల్నేగాక జలాంతర్గాములను కూడా ఆ సంస్థ టార్గెట్‌ చేస్తున్నట్లు తెలియడంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ప్రతికూలతలను పసికట్టగల అత్యాధునిక సెన్సార్లను వాటికి అమర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments