Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో "జైలర్" హవా... బోల్తాపడిన 'భోళాశంకర్'

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (16:59 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తన సత్తా చాటుతోంది. ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో ఏపీ, తెలంగాణాల్లో ఏకంగా రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన పంపిణీదారులు ఏషియన్ సునీల్, నిర్మాత దిల్ రాజులు వెల్లడించారు. అదేసమయంలో ఈ చిత్రంతో పాటు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం "భోళాశంకర్" మాత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచింది. ఈ చిత్రం ఒక రోజు విరామంతో ఆగస్టు 11వ తేదీన విడుదలైంది. 
 
సన్ పిక్చర్స్ బ్యానరుపై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. తొలి రోజునే భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన జైలర్... నాలుగు రోజుల్లో 32 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు వెల్లడించారు. ఈ మధ్య వచ్చిన అనువాద చిత్రాల్లో ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రాలు ఇదే కావడం గమనార్హం. 
 
ఇందులో సూపర్‌స్టార్‌ను దర్శకుడు చూపించిన విధానం, ఆయన స్టైల్‌కి తగినట్టుగా సన్నివేశాలు డిజైన్ చేయడం, యాక్షన్ దృశ్యాల వెంట ప్రేక్షకులను పరిగెత్తిస్తూ వెళ్లి, ఎమోషన్స్‌తో కూడిన ట్విస్ట్ ఇవ్వడం, కుటుంబ క్షేమాన్ని మాత్రమే కాదు.. సమాజ శ్రేయస్సును కూడా చూడాలన్న కోణంలో ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ఫలితంగా జైలర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments