Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యకు మొగుడుగా జగపతిబాబు..?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (12:59 IST)
హీరోకి దీటుగా విలన్ ఉంటేనే కమర్షియల్ సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ అవుతుంది. అలాంటి విలన్‌ని హీరో ఎదుర్కొంటేనే సినిమాలో మజా ఉంటుంది. లెజెండ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ, జగపతిబాబుల మధ్య ఫైట్ ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మార్కెట్‌లో హీరోగా కెరీర్ నిలబెట్టుకోలేక దయనీయ స్థితిలో ఉన్న జగపతిబాబుకు ఆ సినిమా మంచి విలన్‌గా గుర్తింపునిచ్చింది. 
 
జితేంద్రగా అతని పాత్ర, నటన మరిచిపోలేనిది. ఈ సినిమా తర్వాత జగపతి విలన్, క్యారెక్టర్ రోల్స్‌లో చాలా బిజీ అయిపోయాడు. ఇప్పుడు మరోసారి బాలయ్యకు విలన్‌గా జగపతి నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. బాలయ్య ఇటీవల తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో తీయబోతున్న సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 
ఈ సినిమాలో జగపతిని విలన్‌గా ఖరారు చేశారట. జగపతిబాబుకు తగినట్లుగా ఓ పవర్‌ఫుల్ రోల్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. బాలయ్య, జగపతిల పోరును మరోసారి తెరమీద చూడబోతున్నామని అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఇదే డైరెక్టర్‌తో ఇంతకుమందు జగపతిబాబు లింగ సినిమా తీసాడు. కానీ అందులో పాత్ర ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. 
 
ఈసారైనా తగిన పాత్ర ఇస్తాడేమో చూడాలి. అయితే బాలయ్య, రవికుమార్ కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన జై సింహా ఓ మోస్తరుగా ఆడింది. ఆ సినిమా నిర్మాతే ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య బోయపాటితో మరో సినిమాకి సిద్ధం కాబోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments