జబర్దస్త్ షో నటుడు శాంతి స్వరూప్ ఇలా అనేశాడే.. నిజమేనా?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (19:03 IST)
Shanthi Swaroop
జబర్దస్త్ షో బాగా పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ షోలో నటించే వారు బాగా సంపాదించుకుంటారని, పారితోషికం బాగానే పుచ్చుకుంటారని బయట టాక్ వుంది. కానీ అందులో నిజం లేదని తేల్చేసాడు శాంతి స్వరూప్. అసలు ఆ షోలో ఇచ్చే పారితోషికంపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు శాంతి. తెలుగు బుల్లితెరపై నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు జబర్దస్త్ చరిత్ర సృష్టించింది. 
 
అప్పటి వరకు ఎన్ని షోలు వచ్చినా కూడా దీని స్థాయిలో మాత్రం రేటింగ్ తీసుకురాలేదు. ఏడేళ్లుగా నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్‌ను కూడా అందించింది జబర్దస్త్. అక్కడ్నుంచి వచ్చిన వాళ్లే ఇప్పుడు సినిమాలు కూడా చేసుకుంటున్నారు. 
 
జబర్దస్త్ క్రేజ్‌తోనే వాళ్లకు బాగా డబ్బులు వస్తున్నాయి కూడా. ఈ షోతో వచ్చిన ఇమేజ్ కారణంగా బయట ఈవెంట్స్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఫారెన్ వెళ్లి అక్కడ కూడా స్టేజ్ పర్ఫార్మెన్సులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షోలో వాళ్లకు అందుతున్న రెమ్యునరేషన్స్‌పై మాత్రం ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లకు ఎపిసోడ్‌కు 4 లక్షల వరకు వస్తుందని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. మిగిలిన వాళ్లకు కూడా కనీసం లక్షన్నర నుంచి 2 లక్షలకు తక్కువ కాకుండా వస్తుందని ప్రచారం ఉంది. 
 
ఇవన్నీ నిజమేనేమో.. ఒక్కో ఎపిసోడ్‌కు అంత ఇస్తున్నారేమో అనే అనుమానాలు కూడా అందర్లోనూ ఉన్నాయి. అయితే కొందరు జబర్దస్త్ కమెడియన్స్ చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే మాత్రం అంత ఉండదని తేలిపోయింది. 
 
ఇవన్నీ బయటికి చెప్పుకునే దొంగ లెక్కలు.. ఇచ్చుకునే బిల్డప్పులే కానీ అన్నేసి లక్షలు ఇచ్చేంత సీన్ అక్కడ లేదని మరో కమెడియన్ శాంతి స్వరూప్ చెప్తున్నాడు. వీళ్లకు అన్నేసి లక్షలు ఇస్తున్నారని అనవసరంగా బయట చెప్తారు కానీ తమకు వచ్చేది మాత్రం అంత ఉండదని చెప్పుకొచ్చాడు శాంతి. 
 
నిజానికి తమకు జబర్దస్త్ కంటే కూడా బయట చేసే ఈవెంట్స్ నుంచి ఎక్కువ సంపాదించుకుంటామని చెప్తున్నాడు శాంతి స్వరూప్. అంతేకాదు అక్కడ రెగ్యులర్‌గా పేమెంట్ ఇచ్చేవాళ్లు కూడా తక్కువే ఉన్నారని సంచలన విషయాలు చెప్పాడు శాంతి. ఏదేమైనా కూడా మల్లెమాల ఇచ్చేదాని కంటే కూడా బయట చెప్పుకునేది మాత్రం రెండింతలు ఉందనేది శాంతి స్వరూప్ చెప్తున్న మాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments