Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్ దస్త్ రాకింగ్ రాకేష్ హీరోగా కొత్త చిత్రం

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (16:33 IST)
Rocking Rakesh, clap by MP Santosh Kumar
గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ‘జబర్‌దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య హీరోయిన్ గా నటిస్తోంది.
 
ఈ చిత్రం లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ కొట్టారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించగా సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు.
 
చిత్ర ప్రారంభోత్సవంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఫౌండర్ రాఘవ, విఎన్ ఆదిత్య, ప్రవీణ, అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు.
 
లాంచింగ్ ఈవెంట్ లో ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రాకేష్ కి ఆల్ ది వెరీ బెస్ట్. తను ఇంకెన్నో చిత్రాలు చేయాలి. మంచి నటుడిగా, నిర్మాతగా గా పేరు తెచ్చుకోవాలని  కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
మంత్రి రోజా సెల్వమణి మాట్లాడుతూ.. రాకేష్ నా కొడుకు లాంటివాడు. ఎప్పటి నుంచో తనకి లీడ్ రోల్ చేయాలని వుంది. ఈ సినిమాతో అది నెరవేరుతోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మరెన్నో సినిమాలు చేసి ప్రజలకు ఆనందాన్ని పంచాలని  మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
 
తనికెళ్ళ భరిణి మాట్లాడుతూ.. రాకేష్  ప్రతిభావంతుడు. హీరోగా, నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టడం అనందంగా వుంది. రాకేష్ మా గురువు గారు రాళ్ళపల్లి గారి కూడా ఇష్టమైన శిష్యుడు. చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి రాకేష్ మరో పది సినిమాకు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను.  
 
బిక్షపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాకేష్ బుల్లితెరపై ఇప్పటికే పాపులర్ . ఈ సినిమాతో ప్రజలకు వినోదం పంచె చిత్రాన్ని అందిస్తాడని ఆశిస్తున్నాను’’ అన్నారు.
 
ఈ చిత్రాన్ని ఒక పల్లె మట్టివాసన తెలిసే సినిమాగా రూపొందిస్తున్నామని యూనిట్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments