Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సావిత్రి''ని పెళ్ళాడిన జేడీ చక్రవర్తి.. రహస్యంగా మూడు ముళ్లు వేసేశాడు.. వర్మ వచ్చాడా?

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో జేడీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సావిత్రి" సినిమాలో హీరోయిన్‌‌గా నటిస్తున్న అనుకృతిని టాలీవుడ్ హీరో, డైరెక్టర్ జేడీ చక్రవర్తి (46) రహస్యంగా పె

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (10:05 IST)
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో జేడీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సావిత్రి" సినిమాలో హీరోయిన్‌‌గా నటిస్తున్న అనుకృతిని టాలీవుడ్ హీరో, డైరెక్టర్ జేడీ చక్రవర్తి (46) రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. గతంలో ''పాపా'' డైరెక్టర్ యోగిపై సంచలన ఆరోపణలు చేసిన అనుకృతి... అతను అసభ్యకరమైన సీన్లలో తనను నటించమంటున్నాడంటూ ఈ భామ డైరెక్టర్ యోగిపై కేసు కూడా పెట్టింది. 
 
తాజాగా వర్మ సావిత్రిలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అనుకృతి సావిత్రిలో నటించడం.. జేడీ చక్రవర్తి ఆమె ప్రేమలో పడటం జరిగింది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ అందుకు కావాల్సిన పరిణితి కానీ తనలో లేదని పలుమార్లు చెప్పిన జేడీ తల్లి శాంత ఒప్పించడంతో అనుకృతిని పెళ్లి చేసేసుకున్నాడు. 1989లో సంచలన చిత్రం శివతో పరిచయమైన జేడీ ఆ తర్వాత 1998లో సత్యతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో అనుకృతిని జేడీ రహస్యంగా నిరాడంబరంగా పెళ్లి చేసేసుకున్నాడు. ఈ పెళ్లి కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఇక ఓ ఇంటివాడైన జేడీకి టాలీవుడ్ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే శిష్యుడైన జేడీ చక్రవర్తి వివాహానికి గురువైన రామ్ గోపాల్ వర్మ వచ్చారా లేదా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ వర్మ హాజరైనట్లు ఫోటోలు లేకపోవడంతో ఓకే అంటూ సరిపెట్టుకున్నారు.  

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments