Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ నిర్మాతను కూడా నయీమ్ బెదిరించాడా? రూ.5కోట్లివ్వాలని డిమాండ్ చేశాడా?

గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి పదిరోజులవుతున్నా నయీమ్ ఆస్తుల లెక్కలు పోలీసులకు అంతుపట్టడంలేదు. ఒక్క రాష్ట్రంలోనే నయీమ్ చెరలో ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల భూమిలో వెంచర్లు ఉన్నట్లు సిట్ నిర్ధారణ

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (09:39 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి పదిరోజులవుతున్నా నయీమ్ ఆస్తుల లెక్కలు పోలీసులకు అంతుపట్టడంలేదు. ఒక్క రాష్ట్రంలోనే నయీమ్ చెరలో ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల భూమిలో వెంచర్లు ఉన్నట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ బాధితులు రోజుకు ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. పోలీసుల ముందు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
 
తాజా సమాచారం మేరకు సినిమా వాళ్లను కూడా నయీమ్ వదిలిపెట్టలేదని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడని తెలిసింది. సినిమా హిట్ అయితే చాలు ఆ నిర్మాతకు నయీమ్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళేదంట. నయీమ్ అడిగినంతా ఆ నిర్మాత ముట్టజెప్పాల్సిందేనని.. లేకుంటే, చంపేస్తానని బెదిరింపులు వచ్చాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇదంతా పోలీసుల సహాయంతోనే నయీమ్ చేసేవాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నిర్మాతకు కూడా నయీమ్‌తో కష్టాలు తప్పలేదని.. ఆ నిర్మాతను కూడా నయీమ్ బెదిరించాడని తెలిసింది. పవన్ నటించిన ఓ హిట్ సినిమా నిర్మాతకు నయీమ్ గ్యాంగ్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటూ.. రూ.5కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపిస్తామని బెదరించిందని టాక్. అయితే నయీమ్ అడిగినట్టు.. 5 కోట్లు చెల్లించాడో లేదో కానీ.. నయీమ్ అరాచకాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై బాగానే ప్రభావం చూపిందని సినీ పండితులు అంటున్నారు.

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments