Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

దేవీ
శుక్రవారం, 20 జూన్ 2025 (15:48 IST)
NTR and Hrithik Roshan
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్2’. YRF స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతోన్న ఈ ఆరవ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందిస్తోన్న YRF లేటెస్ట్ మూవీ వార్ 2 గురించి చిత్ర దర్శకుడు అయాన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ అయిన హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అనేది అందరినీ ఆకర్షించేలా కథను రూపొందించటంలో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు.
 
అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడటాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తాను. వార్2 ను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆనందం ఉండదు. ఆల్ రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను ముందుకు తీసుకెళుతున్నప్పుడు దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌ను

ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయతీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించటానికి పూర్తిగా నిమగ్నమయ్యాను. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా వార్2 చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా వార్2 సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జయిటెడ్‌గా ఉంటారో, వారి అంచనాలేంటో తెలుసు. అలాంటి వారు థియేటర్స్‌కు వచ్చినప్పుడు వారికి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఈ సినిమా ఉండాలనే ఆలోచించి రూపొందించాం’’ అన్నారు.
 
ఇండియన్ సినిమా సెలబ్రేషన్ చేసుకునేలా వార్2 చిత్రాన్ని తెరకెక్కించాం. హృతిక్, ఎన్టీఆర్ కలయికలో గూజ్ బమ్స్ తెప్పించే సన్నివేశాలతో గొప్ప థియేట్రికల్ అనుభవాన్ని ఈ సినిమా అందిస్తుంది.
 ‘వార్ 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments