కుబేర. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన ప్రధాన తారాగణంతో తెరకెక్కిన చిత్రం కుబేర. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. చిత్రాన్ని చూసేందుకు హీరో ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ కి వెళ్లారు. అక్కడ ప్రేక్షకుల స్పందన చూసి ధనుష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.