Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

దేవీ
సోమవారం, 5 మే 2025 (16:58 IST)
Director Karthik Raju
నా ఫస్ట్ తమిళ్ సినిమా కామెడీ ఎంటర్టైనర్. ఎస్పీబీ గారు ప్రొడ్యూస్ చేశారు. బేసిగ్గా నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ని. పోకిరి, ఒక్కడు, వర్షం, అతడు, సైనికుడు ఇలా చాలా పెద్ద తెలుగు సినిమాలకి వర్క్ చేశాను.  అప్పుడే సినిమా డైరెక్షన్ పై ఆసక్తి ఏర్పడింది. సందీప్ కిషన్ గారితో నిను వీడని నీడను సినిమా చేశాను అని డైరెక్టర్ కార్తీక్ రాజు తెలిపారు.
 
శ్రీ విష్ణు నటించిన  #సింగిల్‌ చిత్రానికి డైరెక్టర్ కార్తీక్ రాజు దర్శకత్వ వహించారు. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. #సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ రాజు సినిమా విశేషాలు ఇలా తెలియజేస్తున్నారు.
 
- ఈ కథ శ్రీ విష్ణు గారికి కోవిడ్ సమయంలో ఈ కథని శ్రీ విష్ణు గారికి చెప్పాను. అప్పుడాయన బ్రోచేవారెవరు చేశారు. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన కథ చెప్పిన తర్వాత మేము చాలా మాట్లాడుకున్నాం. తర్వాత 2023లో ఈ కథని గీతా ఆర్ట్స్ లో చెప్పాను. వాళ్లకు కూడా చాలా నచ్చింది. అలా ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది.
- ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ వుంది. 90% ఆఫ్ స్టోరీలో ఆయన క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళు ఇద్దరి ఫన్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.  
 
- ఇవానా, కేతిక ఇద్దరు అద్భుతమైన యాక్టర్స్. లవ్ టుడే సినిమా చూసినప్పుడు ఇవాళ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది ఇందులో కూడా తన పర్ఫార్మెన్స్ క్యూట్ గా ఉంటుంది. కేతికే కూడా తన పాత్రని అద్భుతంగా చేసింది. ఈ కథలో ఇద్దరి క్యారెక్టర్స్ ఈక్వల్ గా ఉంటాయి.
 
-నేను తమిళ్లో ఈ కథని చెప్పాను. నేను రాసుకున్నప్పుడు డైలాగ్స్ తమిళ్ స్టైల్ లో ఉన్నాయి. వాటిని తెలుగుకి తగ్గట్టుగా మార్చడడం కోసం భాను నందుతో కలసి వర్క్ చేయడం జరిగింది. డైలాగ్స్ చాలా ఫన్ ఫుల్ గా ఉంటాయి.  
 
 -శ్రీ విష్ణు గారు డబ్బింగ్ లో చాలా ఫన్ యాడ్ చేశారు. స్క్రిప్టు 60% ఉంటే ఆయన 100% ఎలివేట్ చేశారు.
 - విశాల్ చంద్రశేఖర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో పాటలన్నీ కథకు తగ్గట్టుగానే ఉంటాయి. ఆడియన్స్ సాంగ్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారు
 
- సింగిల్లో వెరీ సెంటిమెంటల్ స్టోరీ. ఇందులో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంది. రాజేంద్రప్రసాద్ గారితో వచ్చే సీక్వెన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారు లాంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది.
 
- ఒక తమిళ్ డైరెక్టర్ గా తెలుగులో సినిమా చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు ఇక్కడ ఆర్టిస్టులు అందరు కూడా చక్కని తమిళ్ మాట్లాడుతారు. చాలా కంఫర్టబుల్ గా చూసుకుంటారు. నాకు తెలుగు అర్థం అవుతుంది. మా నాన్నగారు తెలుగే. మేము నెల్లూరు నుంచి తమిళనాడులో సెటిల్ అయ్యాం.
 
- సింగిల్ కి సీక్వెల్  ఆలోచన అయితే ఉంది. దీంతోపాటు శ్రీ విష్ణు గారి కోసం ఒక రెండు మూడు కథలు నా దగ్గర ఉన్నాయి. ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆయన బాడీ లాంగ్వేజ్ టైమింగ్ నాకు చాలా ఇష్టం. ఆయనతో మళ్ళీ మళ్ళీ కలిసి పనిచేయాలని ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments