త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (16:52 IST)
ప్రముఖ హీరోయిన్, చెన్నై చంద్రం త్రిషకు పెళ్లయిపోయిందట. కోలీవుడ్ యువ హీరోనే ఆమె భర్త అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గత రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో రాణిస్తున్న త్రిష వయసు నాలుగు పదులు దాటిపోయింది. అయితే, ఆమె గురించి మాత్రం ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంది. 
 
గతంలో తోటి నటుడు విజయ్‌‍తో ఆమె ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ డేటింగ్‌ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా తమిళ యువ హీరో సింబుతో కలిసి ఏకంగా ఏడు అడుగులు వేసినట్టు ప్రచారం ఊపందుకుంది. ఇటీవల త్రిష, సింబులు చాలా సన్నిహితంగా ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 
 
ఈ ఫోటోలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతా కనిపించారు. ఈ ఫోటో బయటకు రావడంతో వారిద్దరూ మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో త్రిష, సింబు పెళ్లివార్త మరోమారు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ వైరల్ అవుతున్న ఫోటో ఇటీవల చెన్నై నగరంలో జరిగిన "థగ్‌లైఫ్" విలేకరుల సమావేశంలోనిది. 
 
మణిరత్నం - కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 5వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సింబు కూడా నటించారు. ఈ విలేకరుల సమావేశంలో త్రిష, సింబులు పక్కపక్కనే కూర్చొని ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటూ కనిపించారు. ఈ ఫోటోను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో వారిద్దరికీ పెళ్లయిపోయినట్టుగ పుకార్లు ప్రచారం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయేల్ సంయుక్త దాడులు.. అరబ్ వణుకుతోంది.. 8 దేశాలపై..?

పారదర్శకత, న్యాయం, వారసత్వ గౌరవం: ఇటీవలి పరిణామాలపై స్పందించిన ప్రిన్స్ ఆజం జా

Banana Prices: భారీగా తగ్గిన అరటి ధరలు.. రైతులకు తప్పని కష్టాలు

వాష్‌రూమ్‌లో 16 ఏళ్ల విద్యార్థినికి గర్భస్రావం.. అబార్షన్ మాత్రలు తీసుకుందా?

ఇరాన్ ఎక్స్‌ట్రాలు చేస్తోంది, ఇప్పటికైనా మాట వింటే సరే లేదంటే నాశనం చేస్తాం: ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments