Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంలో ఒక్క‌సారే అలా వ‌చ్చేది - అనుష్క‌

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (19:51 IST)
Anushka Shetty
ఏ నటికైనా జీవితంలో ఒక్కసారైనా వచ్చే పాత్ర జేజమ్మ అని సీనియ‌ర్ న‌టి అనుష్క శెట్టి తెలియ‌జేసింది. అరుంధతి చిత్రానికి జ‌న‌వ‌రి 16వ తేదీకి 13 సంవత్సరాలు అయిన సంద‌ర్భంగా ఆమె త‌న ఇన్‌స్టా లో ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పాలుపంచుకుంది. చాలాకాలం సోష‌ల్ మీడియాకు దూరంగా వుంటూ ఇదిగో అదిగో అంటూ ఓ కొత్త ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ద‌న్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె త‌న వాయిస్ వినిపించింది. 
 
ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఆ పాత్ర ఇచ్చిన కోడి రామకృష్ణ గారికి నిర్మాత‌ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మొత్తం టీమ్‌కి ధన్యవాదాలు తెలిపింది. ప్రేక్షకులందరికి చాలా పెద్ద కృతజ్ఞతలు. ఇవి నా హృదయం నుంచి వ‌స్తున్న‌వి అని తెలిపింది.
 
ఇక  13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అప్పట్లో ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రంలోని పశుపతి డైలాగ్ వైరల్ అవుతూనే ఉంటుంది. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, అలాగే జేజమ్మగా అనుష్క కనబరిచిన అభినయానికి జనాలు జేజేలు పలికారు. అనుష్కను లేడీ సూపర్ స్టార్‌ని చేసిన ఈ చిత్రం ఆమెకే కాదు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments