Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భ‌య‌పెట్ట‌నున్న అనుష్క శెట్టి - ముఖ్య అతిథి ప్ర‌భాస్‌!

భ‌య‌పెట్ట‌నున్న అనుష్క శెట్టి - ముఖ్య అతిథి ప్ర‌భాస్‌!
, సోమవారం, 8 నవంబరు 2021 (13:58 IST)
Anuksha still
క‌రోనా ముందు క‌రోనా త‌ర్వాత చాలా కాలం గేప్ తీసుకున్న న‌టి అనుష్క శెట్టి ఉర‌ఫ్ స్వీటి మ‌ర‌లా వెండితెర‌పై క‌నిపించ‌బోతోంది. ఇటీవ‌లే త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న తదుపరి చిత్రాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది.  నా తదుపరిది దర్శకుడు #మహేష్ బాబు అంటూ పేర్కొంది. 2013లో `మిర్చి`, 2018లో భాగమతి సినిమాల‌లో అల‌రించిన అనుష్క ఈసారి భ‌య‌పెట్టించే సినిమాలో న‌టించ‌నుంది. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ నిర్మించ‌బోతోంది.

 
త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ స్టిల్‌ను అనుష్క త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనుష్కకు 48వ సినిమా ఇది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అనుష్క అభిమానులకు ఇది నిజంగా బర్త్ డే సర్ ప్రైజ్. ఏ మాత్రం హడావిడి లేకుండా ఉన్నట్టుండి ఆమె కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.


ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు అనుష్క శెట్టి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. భాగమతి సినిమా తెలుగుతో పాటు సౌతిండియన్ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు.

 
ఇది ఓ చారిత్ర‌క అంశాన్ని ఆధారంగా చేసుకుని తీయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొంద‌బోయే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తీయ‌బోతున్నారు. ఈ సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్య అతిథిగా ప్ర‌భాస్ హాజ‌రుకానున్నార‌ని వార్త వినిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షార్ట్ ఫిల్మ్ -దారి కి జాతీయ స్థాయిలో మ‌రో ప్రెస్టీజియ‌స్ అవార్డ్‌