Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

దేవీ
శనివారం, 28 జూన్ 2025 (21:09 IST)
Dil Raju
దిల్ రాజు డ్రీమ్స్ అనే సంస్థను స్థాపించి కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ లో సినిమారంగంలోకి రావాలనుకునే ఔత్సాహితుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడారు.
 
చాలామందిని నేను పరిశీలించార ఛాంబర్ ప్రెసిడెంట్ గా వున్నప్పుడు, నిర్మాతగా మెంబర్ షిప్ చేసుకోవడానికి చాలా మంది వచ్చేవారు. అప్పుడు నిర్మాతల్ని అడిగేవాడిని.. అప్పుడు చాలామందికి సినిమా గురించి ఏమీ తెలియదని అర్థమైంది. నీ సినిమా రిజిస్టేషన్.. మొదలు పెట్టాలంటే ఎలా చేయాలోతెలీదు. ఇక్కడే కాదు యు.ఎస్.లో కూడా అంతే.. నా దగ్గరకి వచ్చి సినిమా తీశాం. ఎలా రిలీజ్ చేయాలని అడిగేవారు.
 
సినిమా తీసి ఆడియన్ దగ్గరకు తీసుకువెళ్ళాలంటే అంత ఈజీకాదు. కొత్త నటీనటులు చేసిన క్రిషి కూడా రిలీజ్ కాకపోతే వేస్ట్ అవుతుంది. అందుకే సరైన నిర్మాతలు, నటీనటులు కోసం దిల్ రాజు డ్రీమ్స్ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది.
 
మేం 30 సంవత్సరాలు కష్టపడి, పంపిణీదారుడిగా వుంటూ మా బేనర్ సినిమాలకు ఒక బ్రాండ్ కోసం ఇన్ని సంవత్సరాలు పట్టింది. అందుకే అందరికీ చెప్పదలిచాను. ఇలా రావడం అంత ఈజీకాదు. 100 మంది దర్శకులు కాావాలని ప్రయత్నిస్తారు. కనీసం 5 గురు అవకాశం వస్తుంది. దానికి రకరకాల కారణాలుంటాయి. ఆ ఐదుగురిలో ఒక్కరే సక్సెస్ సినిమా తీస్తారు. అందుకే సినిమా రంగంలో సక్సెస్ అనేది ఒక్క శాతమే. చాలామంది తమ ఊళ్ళనుంచి ఏదో చేయాలని వస్తుంటారు. వారంతా ఆలోచించుకోవాలి.
 
మేం సినిమా ఫీల్డులో సక్సెస్ అయ్యేవరకు మేం చేస్తున్న ఆటోమొబైల్ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే వున్నాం. అలాగే బయట యూత్ ను స్నేహితులు రకరకాలుగా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు బాగున్నావ్.. హీరోగా చేయి అంటారు. అలాగే కాస్త నవ్విస్తే నువ్వు కామేడీ ఆర్టిస్టువు కావాలంటూ చెబుతారు. కానీ మనం అంతకుముందు చేస్తున్న పనిని వదులుకోకుండా సినిమాల్లో ప్రయత్నాలు చేయండి. 
 
నేనుకానీ, విజయ్ దేవరకొండ, నాని కానీ, పాత జనరేషన్ లో చిరంజీవి, రజనీకాంత్ కానీ చాలా కష్టపడి చేసి ఈ స్థాయికి రాగలిగారు. అందుకే మీరు అందరూ ఒకసారి ఆలోచించి సినీమారంగంలో అడుగు పెట్టండి అంటూ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

గత 30 ఏళ్లలో తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

యూపీలో ఘోరం- రక్షాబంధన్ రోజే 14 ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. ఆపై హత్య

Tirupati: శ్రీవారికి వైజయంతి రాళ్లతో పొదిగిన బంగారు లక్ష్మీ లాకెట్టు

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments