Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి పల్లవితో పని చేయడం గౌరవం- నటుడిగా నాకిది చివరి ప్రయోగం - రానా ద‌గ్గుబాటి

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (13:43 IST)
Sai Pallavi, Rana Daggubati
హీరో రానా భిన్నమైన పాత్ర‌లు పోషిస్తుంటారు. హీరోగా, ప్ర‌తినాయ‌కుడిగా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు పొందారు. తాను హీరోగా చేస్తే విల‌న్‌చేసేవాడు నా హైట్ లేక‌పోవ‌డ‌మే అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు కూడా. బాహుబ‌లి నుంచి ప్ర‌యోగాలు చేస్తున్న ఆయ‌న విరాట‌ప‌ర్వం న‌టుడిగా చేస్తున్న చివ‌రి ప్ర‌యోగం అని తేల్చిచెప్పారు. 
 
బుధ‌వారం రాత్రి విరాట‌ప‌ర్వం ప్రీరిలీజ్‌లో ఆయ‌న  రానా మాట్లాడుతూ.. దర్శకుడు వేణు ఉడుగుల గారు ఎంతో నిజాయితీతో తను పెరిగిన ఊరులో వున్న పరిస్థితుల్లో ఒక భయానక నేపధ్యంలో ఒక అద్భుతమైన ప్రేమకథని చేశారు. సాయి పల్లవి నడుస్తుంటే పక్కన వెన్నెల తిరుగుతున్నట్లు వుంటుంది. సాయి పల్లవి లేకపోతే ఈ సినిమా వుండేది కాదు. సాయి పల్లవితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి అద్భుతమైన కథలు చేసే నిర్మాతలు అరుదుగా వుంటారు.

ఇలాంటి గొప్ప సినిమాని తీసిన నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి ఇలా సాంకేతిక నిపుణులు గొప్పగా పని చేశారు.  రవన్న దళం నవీన్ చంద్ర గారు ప్రియమణి గారు అద్భుతమైన పాత్రలు పోషించారు. ఈశ్వరి రావు, నందితదాస్, జరీనా వహాబ్ ఇలా అందరూ గొప్పగా చేశారు. నాకు కథలు నచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్లాను. ఇది నటుడిగా నేను చేస్తున్న చివరి ప్రయోగం అనుకోవచ్చు. ఇకపై నా అభిమానులు గురించి సినిమాలు చేస్తా. విరాటపర్వం మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments