Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్మీకికి దూరంగా పూజా హెగ్డే... కారణమిదే..

Webdunia
గురువారం, 16 మే 2019 (16:49 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. ఇంకొక పేరు చెప్పాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఆమెకు ఆ రేంజ్‌లో డిమాండ్ ఉంది మరి. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్-అల్లు అర్జున్ ఇలా హీరోలందరితోనూ వరుసబెట్టి సినిమాలు చేసేస్తోంది. 
 
ఇకపోతే వరుణ్ తేజ్ "వాల్మీకి"లో పూజా హెగ్డే ఉంటుందని ఒకసారి... లేదు రెమ్యూనరేషన్ విషయంలో ఏదో ఇష్యూ ఉండటం వల్ల చేయడం లేదని మరోసారి ఇలా రకరకాల ప్రచారం జరిగింది. దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తాను చెప్పేంతవరకు ఏదీ నమ్మొద్దని తేల్చిచెప్పాడు. కానీ దీని తాలూకు అప్‌డేట్స్ మాత్రం లీకవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీటికితోడు మరొకటి వచ్చి చేరింది. 
 
పూజా హెగ్డేని "వాల్మీకి" కోసం ప్రతిపాదించింది నిజమే కాని కథ ప్రకారం అది వరుణ్ తేజ్ కోసంకాదట. ఇందులో హీరో లాంటి మరో కీలక పాత్ర చేస్తున్న తమిళ నటుడు అధర్వాకు జోడిగా అంట. అధర్వా మనవాళ్ళకు పూర్తిగా అపరిచితుడు. 'అంజలి', సిబిఐలో కనిపించాడు. కానీ, సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరికీ గుర్తు లేదు. 
 
ఇప్పుడు పూజాను తన సరసన ఉంచడం అంటే ప్రేక్షకులు ఆమోదిస్తారా అనే ప్రశ్న మెదులుతోంది. "జిగర్ తండా" రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ దీనికి చాలా మార్పులు చేసినట్టుగా యూనిట్ చెబుతోంది. ఇంతకీ పూజా పాత్రకు సంబంధించి టీం అధికారికంగా క్లారిటీ ఇచ్చే దాకా తెలిసేట్లు లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments