దేవుడు మందు కొడ‌తాడా - ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి కావాల‌నే ఆ డైలాగ్ రాశాడా!

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (22:58 IST)
Sharva-Ajay bhopati
సినిమాలోని డైలాగ్‌కు ఒక్కోసారి విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతుంటాయి. అందులోనూ దేవుడిపై డైలాగ్‌లు రాస్తే మ‌రింత మెల‌కువ‌తో రాయాలి. గ‌తంలో కొన్ని సినిమాల్లో దేవుడిని కించ‌ప‌రిచేలా సంభాష‌ణ‌లు రాస్తే అవి వివాదాల‌కు దారితీశాయి. మ‌రి అలాంటిదే `మ‌హాస‌ముద్రం` సినిమాకు వ‌స్తుందేమోన‌ని ఓ సందేహం ట్రైల‌ర్ చూసేవారికి క‌లిగింది. ఇదే విష‌యాన్ని నేరుగా ద‌ర్శ‌కుడిని అడితే.. ఆయ‌న ఏం చెప్పాడో చూద్దాం.
 
మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్ ల‌వ్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఆస‌క్తిగా సాగింది. స‌ముద్రం చాలా గొప్ప‌ది. చాలా ర‌హ‌స్యాల‌ను త‌న‌లోనే దాచుకుంటుంది. అంటూ శ‌ర్వానంద్ ఎంట్రీ డైలాగ్ వుంటుంది. ఆ త‌ర్వాత `ఇక్క‌డ మ‌న‌కు న‌చ్చిన‌ట్లు బ‌త‌కాలంటే మ‌న జాత‌కాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి` అంటూ శ‌ర్వానంద్ చెబుతాడు. ఈ డైలాగ్ విన్న త‌ర్వాత ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు.. అయితే మ‌న జాత‌కాలు బాగుండాలంటే దేవుడు మందుకొట్టి రాయాల‌న్న‌మాట‌.! అంటూ ద‌ర్శ‌కుడిని ప్ర‌శ్నించారు. ఆయ‌న అందుకు అది ఓ సంద‌ర్భంలో అలా రాయాల్సి వ‌చ్చింది. అది సినిమా చూస్తేనే తెలుస్తుంది అన్నాడు. మ‌రి రేపు ఎవ‌రైనా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తే? అనే దానికి ఆయ‌న దాట‌వేశారు. సో. ఇది కూడా ప‌బ్లిసిటీకోసం ఉప‌యోగ‌ప‌డుతుందేమోన‌ని అనుకున్నాడేమో. చూద్దాం ఏం జ‌రుగుతుందో. అస‌లు మ‌న దేవుడ్ని మ‌న‌మే ఇలా కించ‌ప‌రిచేలా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌సం అనేది కొంద‌రిలో నెల‌కొంది. రేపు సెన్సార్ వారు చూసి ఏంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments