శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న సినిమా మహా సముద్రం. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అజయ్ భూపతి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.శుక్రవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ నిర్మాతలు ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శర్వానంద్, సిద్ధార్థ్ ఒకరిపై మరొకరు తుపాకులు ఎక్కుపెట్టుకున్నారు. వీరికి కొంత దూరంలో ఉండే సముద్రంలో హీరోయిన్ అదితిరావు హైదరి నీళ్లలో నిలబడి ఎంజాయ్ చేస్తుంది. శర్వానంద్, సిద్ధార్థ్ లుక్స్ మాసీగా, డిఫరెంట్‌గా ఆకట్టుకుంటున్నాయి. వీరికి భిన్నంగా అందమైన లుక్‌లో అదితిరావు హైదరి కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 14న మహా సముద్రం విడుదలవుతుంది.
ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలో హే రంభ.. అనే సాంగ్‌ను తొలి పాటను విడుదల చేయగా.. ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె.ఎల్ ఎడిటర్, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్.