Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్3కు తగ్గుతున్న ఆదరణ.. బాబోయ్ బద్దలయిపోతోంది.... ఏంటి?

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (20:14 IST)
బిగ్ బాస్3తో ప్రేక్షకుల్లో నిరాశ ప్రారంభమైంది. ప్రారంభంలో వున్న ఉత్సాహం కాస్తా మెల్లగా నీరుగారిపోతూ వస్తోంది. మొదటి వారంలో వున్నంత జోష్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎప్పుడు చూసినా శ్రీముఖి ఏదో ఒక ఎపిసోడ్ లో ఏడుస్తూ కనిపిస్తూ వుండటంతో కొంతమంది వీక్షకులు ఛానల్ మార్చి పారేస్తున్నారట. మాటీవీలో ప్రసారమవుతున్న ఈ షోకు తొలుత మంచి టిఆర్‌పి రేటు ఉండేది.
 
అయితే ఇప్పుడు ఒక్కసారిగా టిఆర్పి రేటు పడిపోయింది. అందుకు కారణం మొదటి బిగ్ బాస్ 1 ఎపిసోడ్, సెకండ్ బిగ్ బాస్ ఎపిసోడ్‌ను తలపించేలా మూడవ ఎపిసోడ్ కూడా తయారైందంటున్నారు ప్రేక్షకులు. వీకెండ్‌లో నాగార్జున చేసే హడావిడి చూసేందుకు మాత్రమే కొంతమంది ఎపిసోడ్‌ను ఫాలో అవుతున్నారు తప్ప షోలోని వారిని చూసేందుకు ఏమాత్రం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
మరోవైపు శారీరక హింసకు చోటులేదని చెబుతూనే హింసాత్మక టాస్కులు ఇవ్వడం బిగ్ బాస్ 3ని చూసేవారి సంఖ్య మరింత తగ్గడానికి కారణమవుతోందంటున్నారు. వెరైటీ టాస్కులలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడం చూసే ప్రేక్షకులకు పరీక్ష పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఏదో సమయంలో శ్రీముఖి కానీ శివజ్యోతి కానీ ఎవరో ఒకరు ఏడుస్తూ కనబడటంతో... బాబోయ్ బద్దలయిపోతోంది అంటూ చానల్ మార్చేస్తున్నారట. మరి ఇలాగే మిగిలిన ఎపిసోడ్లు కొనసాగిస్తారా.. లేకుంటే నాగార్జున ఏదైనా చేసి ట్రెండ్ మారుస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments