Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ హీరోతో కలిసి బాలయ్య సినిమా చేస్తున్నాడా?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (16:15 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో ఓ మూవీ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ఓ మూవీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే... బాలయ్య ఓ యంగ్ హీరోతో కలిసి సినిమా చేయనున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఎవరా యంగ్ హీరో అంటే... నాగశౌర్య అని సమాచారం.
 
 ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. బాలయ్యకు నిర్మాతకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలయ్య ఎక్కువ సినిమాలు చేసిన నిర్మాతల్లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఒకరు.
 
అవి కూడా సూపర్ హిట్ సినిమాలే అవ్వడంతో కృష్ణ ప్రసాద్ పైన బాలయ్యకు మొదటి నుండి కూడా గౌరవం అనడంలో సందేహం లేదు. ఓ యంగ్ డైరెక్టర్ ఈ స్టోరీ రెడీ చేసారని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిసింది. అయితే... ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అంతా సెట్ అయిన తర్వాత పూర్తి వివరాలతో ఈ సినిమాని ప్రకటించనున్నారని తెలిసింది.

సంబంధిత వార్తలు

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

ప్రజాదర్బార్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు వినతులు వెల్లువ!!

ఐస్‌క్రీమ్‌లో జెర్రి... ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన మహిళకు షాక్!

గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!

రాజీనామా చేసిన జగన్ వీరవిధేయుడు కరికాల వలవన్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments