పవన్ మూవీ ఎలా ఉండబోతుందో బయటపెట్టిన డైరెక్టర్

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (12:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు. వేణుశ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ మూవీ సమ్మర్‌కి రానుందని వార్తలు వస్తున్నాయి. అయితే.. రిలీజ్ డేట్ పైన అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్‌లో నటించనున్నారు.
 
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు మరో హీరో కూడా ఉంటారు. ఆ హీరో రానా అని ముందు నుంచి వినపడుతుంది. అయితే... రానా ఇందులో నటించనున్నాడా లేదా అనేది తెలియాల్సివుంది. ఈ సినిమా గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
 
అది ఏంటంటే... పవన్ క్యారెక్టర్‌ని పెంచి.. మిగిలిన హీరో క్యారెక్టర్ తగ్గిస్తున్నారని. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై డైరెక్టర్ సాగర్ చంద్ర స్పందించారు. ఇంతకీ... ఏమన్నారంటే తను ఒక పవన్ అభిమానిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే ఒక అభిమానిగా ఆయన్ని ఎలా చూడాలనుకుంటానో అలా ఈ సినిమాలో చూపిస్తున్నాను అన్నారు.
 
 మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశామని... ఈ సినిమాలో ఉండే ఇంపార్టెంట్ రోల్స్‌ను కూడా బాగా డిజైన్ చేశామని తెలిపారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments