మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ననటి ఐశ్వర్యరాయ్ తల్లి కాబోతున్నట్టు కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పటికే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ దంపతులకు ఆరాధ్య అనే పాప ఉంది. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఐష్... బాలీవుడ్ భామ అలీ యునిస్ డిజైన్ చేసిన ఓ గోల్డ్ కలర్ గౌన్‌ను ధరించి కేన్స్ ఉత్సవాల్లో పాల్గొంది. తన అందచందాలతో అందరి మతిని పోగొట్టింది. వెరైటీ కాస్ట్యూమ్స్‌తో రెడ్ కార్పెట్‌పై ఐష్ హొయలొలికిస్తుంటే కెమెరాలు క్లిక్ క్లిక్‌మనిపించాయి. ఈ డ్రెస్‌లో ఐష్ ఏంజెల్‌లా కనిపిస్తే, మరికొందరికి మాత్రం అనేక అనుమానాలు రేకెత్తించాయి.
ఎందుకో తెలుసా ఐష్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలలో ఆమె పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో ఐష్ గర్భవతి అయిందంటూ కొన్ని వెబ్‌సైట్స్ తెలిపాయి. అయితే ఈ పుకార్లని విన్న ఐశ్వర్య రాయ్ పీఆర్వో విభాగం రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి. డిజైనర్ తయారు చేసిన డ్రెస్ టైట్‌గా ఉండటం వల్ల అందరికి అలా కనిపించి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి రూమర్స్‌ని స్ప్రెడ్ చేయకండి అంటూ విజ్ఞప్తిచేసింది.