Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై జుహూ వీధిలో భిక్షమెత్తిన సింగర్ సోనూ నిగమ్.. ఎందుకు... ఎవరికోసం?

Webdunia
బుధవారం, 18 మే 2016 (14:32 IST)
సోనూ నిగమ్.. దేశంలో మంచిపేరున్న గొప్ప సింగర్.. అతను పాట పాడారంటే ప్రేక్షకులు కాలు కదపాల్సిందే. అంత డిమాండ్ ఉన్న ప్లేబాక్ సింగర్ సోనూ నిగమ్... తనకు తానుగా ఆడియెన్స్ ముందుకొచ్చి వీనుల విందైన పాటలు పాడి సంగీత ప్రియులను సంగీతసాగరంలో ముంచెత్తుతాడు. అలాంటి సింగర్ ఉన్నట్టుండి ఓ బిచ్చగాడిగా మారాడంటే నమ్ముతారా... నిజం ఇది నమ్మితీరాల్సందే. 
 
హార్మోనియం పెట్టేను చేత పట్టుకుని పాటలు పాడుతూ రోడ్డు మీద అడుక్కుంటూ తిరిగాడు. ఇదంతా నిజం కాదండోయ్ ఓ డిజిటల్ ఛానల్ కోసం ఇలా వెరైటీగా వీడియో షూట్ చేశాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు అచ్చం బిచ్చగాడిలా మేకప్ వేసుకున్న సోనూ.. రోడ్డులో హార్మోనియమ్ వాయిస్తూ పాటలు పాడాడు. అటుగా వెళ్తున్న బాటసారులెవ్వరూ ఆ సింగర్‌ను గుర్తు పట్టలేకపోయారు. 
 
ముంబైలోని జూహూ వీధిలో ఈ వీడియో షూట్‌ని తీశారు. ఈ వీడియోకు ''ద రోడ్‌సైడ్ వస్తాద్'' టైటిల్‌ను ఖరారు చేశారు. రోడ్డు మీద సోనూ పాటలు విన్న కొందరూ ఆయనకు చిల్లర కూడా వేశారు. ఓ వ్యక్తి రూ.12 ఇచ్చి భోంచేయమన్నాడు కూడా. తాను పుట్టినప్పుడు తన తల్లితండ్రులు తెచ్చిన హార్మోనియమ్‌తో సోనూ వీధికెళ్లి అడుక్కోవడం విశేషం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments