Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బతికేది మరికొన్ని నెలలు మాత్రమే.. నా మెదడు నాకు నిత్యం చెబుతోంది...

ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్భాన్ ప్రతి ఒక్కరినీ విషాదంలో ముంచే వ్యాఖ్యలు చేశారు. తాను బతికేది మరికొన్ని నెలలు మాత్రమేనని, ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోందంటూ వ్యా

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (16:55 IST)
ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్భాన్ ప్రతి ఒక్కరినీ విషాదంలో ముంచే వ్యాఖ్యలు చేశారు. తాను బతికేది మరికొన్ని నెలలు మాత్రమేనని, ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోందంటూ వ్యాఖ్యానించారు.
 
న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌‌‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆయన ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
'నేను బతికేది మరికొన్ని నెలలు మాత్రమే. ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోంది. కొన్ని నెలలు, లేదంటే ఏడాది.. మహా అయితే రెండేళ్లు బతుకుతాను కావచ్చు. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను కట్టిపెట్టేస్తాను. నాకున్న జీవితాన్ని హ్యాపీగా అనుభవిస్తాను' అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. 
 
ఈ అనుభవంతో తనకు జీవితంపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. ప్రస్తుతం తాను జీవితాన్ని మరో కోణంలోంచి చూస్తున్నట్టు ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కీమో థెరపీ నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయని, మొత్తం ఆరు జరగాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆరు సైకిళ్లు పూర్తయ్యాక స్కాన్ చేయాల్సి ఉంటుందన్నాడు. ఆ తర్వాత మాత్రమే ఏం చేయాలనేది తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments