బ్లాక్ కాఫీలో గల అద్భుత ప్రయోజనాలు....
సాధారణంగా కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ కాఫీ తాగడం వలన మన శరీరం పలు విటమిన్లను శోషించుకుంటుంది. పలు అనారోగ్య సమస్యలు కూ
సాధారణంగా కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ కాఫీ తాగడం వలన మన శరీరం పలు విటమిన్లను శోషించుకుంటుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మరి ఈ బ్లాక్ కాఫీ తాగడం వలన ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీ తాగడం వలన లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 40 శాతం వరకు తగ్గుతాయి. బ్లాక్ కాఫీని తాగితే డిప్రెషన్ నుండి బయటపడవచ్చును. మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ బ్లాక్ కాఫీ తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేసేందుకు కారణమయ్యే న్యూరోట్రాన్స్‌మీటర్లు బ్లాక్ కాఫీ తాగడం వలన విడుదలవుతాయి.
బ్లాక్ కాఫీ తీసుకోవడం వలన శరీర మెటబాలిజం 11 శాతం వరకు పెరుగుతుంది. దీంతో క్యాలరీలు, కొవ్వు కరుగుతాయి. ఇది అధిక బరువును తగ్గించుకునేందుకు మేలుచేస్తుంది. బ్లాక్ కాఫీలో విటమిన్ బి2, బి3, బి4, మాంగనీస్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తాగడం వలన గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.