Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దర్శకుడు అనుకున్నంత పని చేశాడు... అశ్లీలానికి పరాకాష్టలా చిత్రాన్ని తీశాడు...

ఈ మధ్యకాలంలో దర్శకులు తాము ఏం కావాలనుకుంటున్నారో ఎలా తీయాలనుకుంటున్నారో అలా తీసేస్తున్నారు చిత్రాలు. లాభనష్టాల సంగతి పక్కన పెట్టి యూత్‌ను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రయత్నమే దర్శకుడు వె

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:44 IST)
ఈ మధ్యకాలంలో దర్శకులు తాము ఏం కావాలనుకుంటున్నారో ఎలా తీయాలనుకుంటున్నారో అలా తీసేస్తున్నారు చిత్రాలు. లాభనష్టాల సంగతి పక్కన పెట్టి యూత్‌ను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రయత్నమే దర్శకుడు వెంకటేష్‌.కె తన చిత్రం ద్వారా చేయబోతున్నాడు. ఆయన ఇటీవల మీడియా సమావేశంలో చెప్పినట్టుగా తాను విడుదల చేయబోయే వీడియో ఖచ్చితంగా అశ్లీలంగా, ఆకర్షణీయంగా, స్పైసీగా, యూత్‌ను రెచ్చగొట్టేవిధంగా, అన్ని వర్గాల వారిని గిలిగింతలు పెట్టేదిగా ఉంటుందని చెప్పారు. 
 
తీరా ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూస్తే అన్నంత పని చేశారు దర్శకుడు అనిపించింది. శృంగారానికి పరాకాష్టగా సెక్స్‌ అప్పీల్‌తో యూత్‌ మతి పోగొట్టేలా ఉంది ఆ వీడియో. ఇంతకీ ఆ చిత్రం పేరు చెప్పలేదు కదా! ‘ఇప్పట్లో.. రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ..!’. ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్‌.కె యువకుడు కావడంతో పాటు తన అభిప్రాయాలను, అభిరుచులను ఈ చిత్రంలో చూపించారు. 
 
మొదట రొమాంటిక్‌ పిక్చర్స్‌తో కూడిన స్టిల్స్‌ రిలీజ్‌ చేశారు. తర్వాత స్పైసీతో కూడిన పోస్ట్‌ర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇవన్నీ వెబ్‌సైట్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. యూత్‌ను ఆకర్షిస్తూ దృష్టి మరల్చుకోకుండా చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన వీడియోనే ఇలావుంటే రేపు సినిమా ఎంత సెక్సీగా, స్పైసీగా, రొమాంటిక్‌గా ఉండబోతోందన్నట్టుగా ఎదురుచూసేలా పరిస్థితి నెలకొంది. ఈ చిత్రం నిర్మాత ప్రశ్నార్థ్‌ తాతా దర్శకుడికి ఇచ్చిన స్వేచ్ఛతో ఆయన దీన్నో హాట్‌ చిత్రంగా తయారుచేశాడని అనుకోవచ్చు. 
 
ఈ వీడియో ఎలా ఉందో సినిమా అంతా అలాగే ఉంటుందని ప్రకటించడంతో యూత్‌లో మరింత క్రేజ్‌ ఏర్పడింది. ఇది బిజినెస్‌ వర్గాలపై కూడా పనిచేసి సినిమా కూడా హాట్‌ కేక్‌లా అమ్ముడుపోవచ్చని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా ఉండచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం మార్చినెలలో విడుదల అవుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం