Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ జనహితం కోసమే రాజకీయాల్లోకి వచ్చారా? తమ్మారెడ్డి ప్రశ్న

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ''నా ఆలోచన'' అంటూ యూట్యూబ్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ జనహితం కోసమే రాజకీయాల్లో వచ్చాడని అందరం న

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:42 IST)
ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ''నా ఆలోచన'' అంటూ యూట్యూబ్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ జనహితం కోసమే రాజకీయాల్లో వచ్చాడని అందరం నమ్ముతున్నామని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే.. పవన్ ప్రత్యేక హోదాపై బయటికొచ్చి పోరాడాలన్నారు. నిజంగా ప్రజల హక్కుల కోసం పవన్ పోరాడితే.. ఆయన బాటలో నడిచేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 
 
పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శల వర్షం కురిపించారు. చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సభలో పవన్ ‘ఏపీ స్పెషల్ స్టేటస్’ ప్రసంగంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల గురించి, తన జనసేన వెబ్‌సైట్ గురించి చాలా బాగా మాట్లాడారని, కానీ, స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడిన తీరు బాగాలేదని విమర్శించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే...
 
ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు క్లారిటీ ఇవ్వాలని పవన్ కల్యాణ్ అనడంపై అర్థం లేదన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు క్లారిటీ ఇచ్చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేరో వివరణ ఇచ్చారు. జనవరి 26న ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైజాగ్ ఆర్కే బీచ్‌లో బృహత్ కార్యక్రమానికి విద్యార్థులు శ్రీకారం చుట్టారు. కానీ యువత భారీ ఎత్తున కదిలొచ్చినా.. సంపూర్ణేష్ వారికి మద్దతు పలికి అరెస్టయినా పవన్ రాలేదు. 
 
స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోవడానికి ఇప్పటికే వివరణలు ఇచ్చినా.. మళ్లీ ఆయన ఎందుకు ఇవ్వలేదు అని అడగడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. 2019 ఎన్నికల కోసమే అన్ని పార్టీలూ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మట్లాడుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా అదే కోవలో మాట్లాడుతున్నారు. స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదో పవన్‌కు కేవలం సమాధానమే కావాలంటే.. చంద్రబాబు, కేంద్రం ఎప్పుడో చెప్పేశాయని తమ్మారెడ్డి గుర్తు చేశారు. 
 
హోదా కావాలంటే... ఫిరంగులకు గుండెను అడ్డంపెట్టే వాళ్లు కావాలని పవన్ అంటున్నారు. అలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారనే విషయాన్ని తమ్మారెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇచ్చినా పవన్ ఇలా మాట్లాడటం సరికాదని.. స్పెషల్ స్టేటస్‌పై పవన్ పోరాటం చేస్తే అనేకమంది ఆయన వెన్నంటి వుంటారనే విషయాన్ని గుర్తు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

కుమార్తెకు అత్తింటి వేధింపులు... చూడలేక తండ్రి ఆత్మహత్య

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments