Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ అప్పుడప్పుడొచ్చి పిల్లలతో గడుపుతారు.. నాతోనూ మాట్లాడుతారు: రేణూ దేశాయ్

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది రేణూ దేశాయ్. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మాయిల భద్రతపై నోరు విప్పింది. తన కుమారుడిని సరిగ్గా పెంచుతున్న

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (12:00 IST)
టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది రేణూ దేశాయ్. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మాయిల భద్రతపై నోరు విప్పింది. తన కుమారుడిని సరిగ్గా పెంచుతున్నానని వెల్లడించారు. మన ఇంట్లో అబ్బాయిలను సరిగ్గా పెంచితే.. బయట ఆ పిల్లాడు బుద్ధి మంతుడిలా మసలుకుంటే సమాజంలో అమ్మాయిలకు ఎందుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పుకొచ్చారు. 
 
దేశంలో జరుగుతున్న అక్రమాలు చూసి భయంతో పిల్లలను అంటిపెట్టుకునే ఉంటున్నానని, వాళ్లను స్వయంగా స్కూ‌లో దింపి, తిరిగి తీసుకొస్తుంటానని అన్నారు. సింగిల్ పేరెంట్ గా ఉన్న తనకు అనుక్షణం బాధ్యతలు గుర్తుకొస్తుంటాయని, పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలని నిత్యమూ కృషి చేస్తుంటానని అన్నారు.
 
తన కుమారుడు అకీరాకు మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తుంటానని రేణూ దేశాయ్ వెల్లడించారు. తాను చెప్పే మాటలు తన జీవితానికి సంబంధించినవి కాకున్నా, ఇటువంటి విషయాలపై తాను మాట్లాడగానే చర్చ మొదలవుతుందని, ఎందుకలా జరుగుతుందో తెలియదని తెలిపారు.  
 
ఇకపోతే తన మాజీ భర్త గురించి రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. పవన్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. హార్డ్ వర్క్, క్రమశిక్షణ, మంచితనం ఇలా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. అనుకున్నది సాధించేవరకూ ఆయన శ్రమిస్తారని చెప్పారు. ఇక అప్పుడప్పుడు ఆయన వచ్చి పిల్లల కోసం చాలా సమయాన్ని కేటాయిస్తారనీ, తనతో అనేక విషయాలు మాట్లాడతారని అన్నారు. "ఇంతమంచిగా వుండే మీరెందుకు విడాకులు తీసుకున్నారు"? అంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోతూ ఉంటారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments