Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్య కథను ముందుగా సుక్కు ఎవరికి చెప్పాడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (16:47 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఆర్య. ఈ చిత్రం ద్వారా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమర్ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించారు. వన్ సైడ్ లవ్ అంటూ ఆర్య ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అటు అల్లు అర్జున్‌కి, ఇటు సుకుమార్‌కి ఇద్దరికీ... ఆర్య మంచి పేరు తీసుకువచ్చింది. 
 
అంతేకాకుండా.. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
 
 అది ఏంటంటే... సుకుమార్ ఆర్య కథను రెడీ చేసిన తర్వాత దిల్ రాజుకి చెబితే.. ఈ సినిమాను తను నిర్మిస్తానని చెప్పారట. ఏ హీరోకి చెబుదామని ఆలోచించి.. సుకుమార్ ఫస్ట్ ప్రభాస్‌కి ఈ కథను చెప్పాడట. కథ విని ప్రభాస్ బాగుందని చెప్పాడట కానీ.. ఎందుకనే ఇంట్రస్ట్ చూపించలేదట. 
 
దీంతో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి చేస్తానన్నాడట సుకుమార్. అయినా.. ప్రభాస్ స్పందించకపోవడంతో ఈ కథను రవితేజకు చెప్పాడట. రవితేజ కూడా ఈ కథపై అంతగా ఆసక్తి చూపించలేదట. ఆ తర్వాత నితిన్‌కి చెబితే.. అక్కడ కూడా సేమ్ రియాక్షన్.
 
 ఆ తర్వాత అల్లు అర్జున్‌కి చెబితే.. వెంటనే ఓకే చెప్పాడట. 4 కోట్లతో రూపొందిన ఈ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. నిర్మాతకు ఆర్య ఎంతటి లాభాలను అందించిందో.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments