Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శెట్టికి భారీ ఆఫర్స్.. మూడు సినిమాలు రెడీ..

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (09:47 IST)
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవల విడుదలైన "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" చిత్రంతో తిరిగి వచ్చింది. ఇక లేటెస్ట్ ఏంటంటే.. అనుష్క శెట్టి తర్వాతి సినిమాపై ఇప్పుడు ఆసక్తికర బజ్ వినిపిస్తోంది. 
 
ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి మళ్లీ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో నటిస్తుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్టు జరిగితే అనుష్క చాలా కాలం తర్వాత ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో కనిపించనుంది. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
అలాగే మలయాళంలో నటించేందుకు కూడా అనుష్క రెడీ అవుతున్నారు. హోమ్ చిత్రం ఫేమ్ రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెై సూర్యకు జంటగా అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే పూర్తి అయ్యాయి. 
 
ఈ చిత్రంలో  హీరోయిన్‌గా అనుష్క శెట్టిని ఫిక్స్ చేశారని తెలిసింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా మరో హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు వెల్లడించింది. అలాగే, ఈ చిత్రంలో విలన్‌గా టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments