Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

చిత్రాసేన్
బుధవారం, 5 నవంబరు 2025 (18:13 IST)
Bandla Ganesh
గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. ఏదైన సినిమా  వేడుకకు వెళితే అక్కడ ఆవేశంగా తన దైన శైలిలో మాట్లాడతాడు. అలాంటిదే రెండు రోజులనాడు కిరణ్ అబ్బవరం నటించిన కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. కిరణ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆ క్రమంలో చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని వచ్చాడని అన్నారు. అలాంటి అందరూ తీసుకోవాలంటూ.. ఒక్క సక్సెస్ రాగానే హీరోలంతా ఎలా బిహేవ్ చేస్తారో అనేది చెప్పేశారు.
 
సక్సెస్ తో వారి స్టయిల్ మారిపోతుంది. ప్రతివాడూ రాజమౌళి, సుకుమార్ కావాలంటూ వారి పేర్లను కోడ్ చేశారు. అయితే ఇది జరిగిన తర్వాత బండ్ల గణేష్ పై ప్రముఖులు ఫైర్ అయినట్లు తెలిసింది. అందుకే ఆయన తన మాటలు వాపసు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.
నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.. అంటూ వివరించారు.
 
అలాగే గబ్బర్ సింగ్ వంటి సినిమా తీశా. మరో అవకాశం ఇస్తే అలాంటి సినిమా తీస్తానంటూ.. వ్యాఖ్యానించాడు. అలాగే.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం: ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.
మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి  చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను అంటూ మరో క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments