Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో దగ్గుబాటి రానాకు క్షమాపణలు చెప్పిన ఇండిగో

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (12:39 IST)
హీరో దగ్గుబాటి రానాకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ క్షమాపణలు చెప్పింది. మీ అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది. విమానాశ్రయంలో మిస్ అయిన లగేజీని వీలైనంత త్వరగా మీకు అందిస్తామంటూ పేర్కొంది. 
 
కాగా, ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ వెళ్లిన తర్వాత వారు బుక్ చేసుకున్న విమానం రద్దు అయింది. 
 
దీంతో మరో విమానంలో వెళ్లాలని సూచించారు. లగేజీ కూడా అదే విమానంలో వస్తుందని సిబ్బంది చెప్పారు. దీంతో సమ్మతించి రానా ప్రత్యామ్నాయ విమానంలో బెంగుళూరుకు వెళ్ళారు.
 
బెంగుళూరు ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత రానాకు చెందిన లగేజీ మాత్రం మిస్ అయింది. దాంతో రానా అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విమానాశ్రయ సిబ్బంది కూడా సరైన వివరణ ఇవ్వలేక పోయారు. దీంతో ఉన్నతాధికారులను కూడా ప్రశ్నించగా, వారి నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ట్విట్టర్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. 
 
విమానాలు ఎపుడొస్తాయో, ఎపుడు వెళతాయో తెలియదు. మిస్సయిన లగేజీ ఎలా కోనుగొనాలో తెలియదు. ఈ విషయాలు సిబ్బందికే తెలియదు అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు ఇండియో ఎయిర్‌లైన్స్ ప్రచార పోస్టులపైనా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. దీంతో రానా ట్వీట్‌కు నెటిజన్లు కూడా మద్దతు పలుకుతూ ఆ విమానాల్లో తమకు ఎదురైన అనుభవాలను కూడా వారు షేర్ చేశారు. 
 
రానా చేసిన ట్వీట్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించింది. "మీ లగేజీ మీకు వీలైనంత త్వరగా మీకు చేరేలా మా సిబ్బంది చురుగ్గా పని చేస్తున్నారు" అని ట్వీట్ చేసింది. దీంతో రానా శాంతించి తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల గురించి చేసిన ట్వీట్‌ను ఆయన తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమపై కేంద్ర మంత్రి ప్రశంసలు.. బన్నీకి మద్దతుగా..

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు..! (Video)

కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఆత్మహత్యలా?.. హత్యలా? (Video)

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments