Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాళీ పోస్టర్ రచ్చ: ట్విట్టర్ తొలగింపు.. క్షమాపణలు చెప్పిన కెనడా

Advertiesment
Kali
, గురువారం, 7 జులై 2022 (11:44 IST)
Kali
ప్రముఖ దర్శకురాలు లీనా మణిమేకలై తెరకెక్కించిన ' కాళీ' చిత్ర పోస్టర్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా ఇదే ఇష్యూపై బాలీవుడ్ నటి నుస్రత్ జహాన్ తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

కాళీదేవి వేషధారణలో ఉన్న స్త్రీ సిగరెట్ తాగుతున్నట్లు చూపించడం పట్ల తమ మతవిశ్వాసాలు దెబ్బతిన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్లకు పలు ప్రశ్నలు సంధించింది. 
 
ఇక ఈ బ్యూటీ ఇటీవల ఎరుపు, బంగారు రంగు వర్ణపు చీర, చేతిలో త్రిశూలంతో దుర్గాదేవి వేషధారణలో కనిపించిన సంగతి తెలిసిందే.

అయితే 'ఒక ముస్లిం యువతి హిందూ దేవతగా ఎలా కనిపిస్తుంది' అంటూ కొంతమంది తనను చంపేస్తామంటూ భయాందోళనకు గురిచేశారు.
 
కెనడాలో నివసిస్తోన్న భారతీయ దర్శకురాలు, ఉద్యమకారిణి లీనా మణిమేకలై తీరు పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కెనడాలోని భారత రాయబార కార్యాలయం సైతం ఘాటుగా స్పందించింది.
 
మహంకాళి అమ్మవారు పొగతాగుతున్న(స్మోకింగ్​ కాళీ) పోస్టర్‌పై వివాదం పెద్దదైంది. హిందూ దేవతలను కించపరిచేలా ఇట్లాంటి పోస్టర్లు, చిత్రాలు తీయడం తగదంటూ పలు సంఘాలు ఫిర్యాదు చేసిన దరిమిలా ఒట్టావా (కెనడా)లోని భారత హైకమిషన్ తెలిపింది. 
 
చిత్రనిర్మాత లీనా మణిమేకలై రిలీజ్​ చేసిన "స్మోకింగ్ కాళి" పోస్టర్‌పై కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత ఎంబసీ కోరింది. 
 
ఇలాంటి రెచ్చగొట్టే అంశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత అధికారులు కెనడాకు సూచించారు. అయితే దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
 
ఆగాఖాన్ మ్యూజియంలో "అండర్ ది టెంట్" ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రదర్శించిన చిత్రం పోస్టర్‌పై హిందూ దేవుళ్లను అగౌరవంగా చిత్రీకరించడంపై కెనడాలోని హిందూ సంఘాల నేతల నుంచి ఫిర్యాదులు అందాయని భారత హైకమిషన్ తన లేఖలో పేర్కొంది. 
 
అలాగే ఆగా ఖాన్ మ్యూజియం నుంచి వివరణ కోరింది. నోటీసులను జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. ఆ వెంటనే ఆగా ఖాన్ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
 
కాళీ పోస్టర్ వల్ల భారత్‌లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల విచారిస్తున్నామని తెలిపింది. క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. అండర్ ద టెంట్ అనే బ్యానర్ కింద మొత్తం 18 షార్ట్ వీడియోలను ఆహ్వానించామని, టోరంటో మెట్రో పాలిటన్ యూనివర్శిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మణిమేకలై కాళీ పేరుతో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరిస్తోన్నట్లు వివరణ ఇచ్చింది. ఇక ట్విట్టర్ కూడా ఈ ఫోటోను తొలగించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. రోడ్ల వెంబడి ఇనుప కంచెలు