Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఓ బ్ర‌హ్మాస్త్రం కావాలి - ఎన్టీఆర్‌

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (16:37 IST)
Brahmastram function
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్రం’ మొద‌టి భాగం శివ‌.  అలియా భ‌ట్ హీరోయిన్‌. స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
 
నాలుగేళ్ల నుంచి రాజ‌మౌళితో ఈ జ‌ర్నీ
ఈ కార్య‌క్ర‌మంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారు ఈవెంట్ ఆర్గ‌నైజ్ చేస్తున్నారు. ఎలా ఉంటుందోన‌నిపించింది. అలాగే తార‌క్ ఈవెంట్‌కి వ‌స్తున్నాడంటే క్రేజ్‌, ఫ్యాన్స్ ఎలా ఉంటుందోన‌ని మ‌న‌సులో ఊహించుకున్నాను. సెప్టెంబ‌ర్ 2.. నా అన్న హ‌రికృష్ణ‌గారి బ‌ర్త్ డే. నందమూరి తార‌క రామారావుగారి బిడ్డ‌.. ఆయ‌న బిడ్డ నంద‌మూరి తార‌క రామారావు ఇక్క‌డ కూర్చున్నాడు. నా బిడ్డ ముందు నా అన్న‌కు ఓ సారి హ్యాపీ బ‌ర్త్ డే చెప్పుకుంటున్నాను. రాజ‌మౌళిగారు బ్ర‌హ్మాస్త్ర సినిమాను స‌మ‌ర్పిస్తున్నారంటే ఏదో ఊర‌క‌నే కాదు.. అయాన్ ఆల్ రెడీ స్క్రిప్ట్ చెప్పారు. నాలుగేళ్ల ముందు నుంచి రాజ‌మౌళిగారు ఈ జ‌ర్నీలో భాగ‌మై ఉన్నారు. సాధార‌ణంగా నేను రాజ‌మౌళిగారే ఆయ‌న సినిమాను మూడు నాలుగేళ్ల పాటు తెర‌కెక్కిస్తారు. సినిమాను చెక్కుతుంటారు కాబ‌ట్టే జ‌క్క‌న్న అనే పేరు వ‌చ్చింది. ఇప్పుడు త‌న ప్ర‌తి రూపంగా అయాన్ క‌నిపిస్తున్నారు. నేను చూసినంత వ‌ర‌కు బ్ర‌హ్మాస్త్ర విజువ‌ల్‌గా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరుస్తుంది. అంద‌రికీ వండ‌ర్‌ఫుల్ జ‌ర్నీగా.. విజువ‌ల్ ట్రీట్‌గా అనిపిస్తుంది. మౌనీ రాయ్ అద్భుతంగా న‌టించింది. ర‌ణ్‌భీర్ క‌పూర్ - ఆలియా భ‌ట్‌ల‌ను చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు నా స్నేహితుల‌య్యారు. మంచి టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు. అందుకే వారిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. టాలెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి.. ఎలా ఎంక‌రేజ్ చేయాలో క‌ర‌ణ్ జోహార్‌కు చాలా బాగా తెలుసు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ కాన‌టువంటి భారీ చిత్రంగా బ్ర‌హ్మాస్త్ర ఉండ‌బోతుంది. భారీ రేంజ్లో విడుద‌ల‌వ కానుంది’’ అన్నారు.
 
వారి మాట‌ల‌ను వినాల్సిన బాధ్య‌త - ఎన్టీఆర్ 
ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ముందుగా నా అభిమానులకు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తున్నాం. ఎంతో ఆర్భాటంగా వేడుక చేయాల‌నుకున్నాం. కానీ పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌లేమ‌ని అన్నారు. వాళ్లు మ‌న సేఫ్టీ కోసమే చెప్పారు. వారి మాట‌ల‌ను వినాల్సిన బాధ్య‌త పౌరులుగా మ‌న‌కుంది. అందుక‌నే ఈవెంట్‌ను చేయాల్సిన చేయలేక‌పోతున్నాం. ఇక్క‌డ‌కు రావాల‌నుకున్న అభిమానులు రాలేక‌పోయినందుకు వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పుకుంటున్నాం. వారు ఈవెంట్‌కి రాలేక‌పోయిన‌ప్ప‌టికీ మంచి సినిమాల‌ను ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం.
 
ఆయ‌న‌కు నేను పెద్ద అభిమానిని
నేను ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా మంది న‌టీన‌టులను ఇష్ట‌ప‌డ‌తాను. అయితే అందులో కొంద‌రే నాపై ప్ర‌భావం చూపించారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌గారి సినిమాల్లో ఆయ‌న పాత్ర‌ల్లోని ఇన్‌టెన్సిటీని ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న‌కు నేను పెద్ద అభిమానిని. ఆయ‌న మాట‌లు, క‌ళ్లు, ఆయ‌నెలా నిల‌బ‌డుతారో ఆస్టైల్‌.. అలా ప్ర‌తి విష‌యం నాకు ఇన్‌టెన్స్ అనే చెప్పాలి. న‌టుడిగా ఆయ‌న నాపై ఎంతో ప్ర‌భావాన్ని చూపారు. ఆ త‌ర్వాత నేను అంత క‌నెక్ట్ అయిన న‌టుడు ర‌ణ్‌భీర్‌. త‌న ప్ర‌తీ సినిమా న‌న్ను న‌టుడిగా ఎంతో ఇన్‌స్పైర్ చేసింది. ఆయ‌న సినిమాల్లో నాకెంతో ఇష్ట‌మైన సినిమా రాక్‌స్టార్‌. సాధార‌ణంగా రెహ‌మాన్‌గారి పాట‌లు అంద‌రికీ న‌చ్చుతాయి. అయితే వాటిని పెర్ఫామ్ చేసేట‌ప్పుడు ర‌ణ్‌భీర్‌లో ఇన్‌టెన్సిటీ, త‌న పాత్ర నాపై ఎంతో ప్ర‌భావాన్ని చూపింది. న‌టుడిగా నాకు స్ఫూర్తినిచ్చింది. న‌టుడిగా ర‌ణ్‌భీర్ ప్ర‌యాణం బ్ర‌హ్మాస్త్ర‌తో ఆగ‌కూడ‌ద‌ని భావిస్తున్నాను. న‌టుడిగా త‌ను ఇంకా ఎన్నో గొప్ప విష‌యాల‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఆలియాతో ఎంతో మంచి అనుబంధం ఉంది. త‌ను డార్లింగ్‌. ఆర్ఆర్ఆర్ స‌మ‌యంలో త‌న‌తో క‌లిసి ప‌ని చేశాను. త‌ను ఎంతో గొప్ప వ్య‌క్తి. అద్భుత‌మైన న‌టి. త‌న‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌.
 
క‌ర‌ణ్‌జోహార్‌గారు, రాజ‌మౌళిగారు క‌లిసి మ‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఏకం చేశారు. ఆయ‌నంటే ఎంతో గౌర‌వం. ఈ సినిమాతో క‌ర‌ణ్ జోహార్‌గారు త‌న కెరీర్‌లో మ‌రో మైల్‌స్టోన్‌ను సాధిస్తార‌ని భావిస్తున్నాను. అయాన్ ఎంత టెన్ష‌న్ ప‌డుతున్నాడో నాకు తెలుసు. త‌ను నాకు మంచి స్నేహితుడు. ఆయాన్‌కి ఆల్ ది బెస్ట్‌. నాగార్జున బాబాయ్ న‌టించిన ఖుదా గ‌వా సినిమా ఎంతో ఇష్టం. ఓ తెలుగు యాక్ట‌ర్ హిందీలో న‌టించి, హిందీలో మాట్లాడితే ఎలా ఉంటుందా? అని చూసిన మొద‌టి చిత్ర‌మిది. ఆయ‌న గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌టుడిగా, స్టార్‌గా ఆయ‌నేం సాధించారో మ‌న‌కు తెలుసు. నా వ‌య‌సు స‌రిపోదు. ఆయ‌న కూడా ఈ సినిమాకు ఓ బ్ర‌హ్మాస్త్రంగా ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 
సినిమా ఇండ‌స్ట్రీ ఈరోజు గ్లోబ‌ల్‌గా కూడా తెలియ‌ని ప్రెష‌ర్‌కి లోన‌వుతుంది. ఎందుకంటే ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ఏదో కావాలి. ఇంకా ఏదో కావాలి. నేను వ్య‌క్తిగ‌తం చెప్పేవిష‌య‌మేమంటే మేం ప్రెజ‌ర్‌లో ఉన్న‌ప్పుడు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాం. ప్రెషర్ బావుంది. టోట‌ల్ సినీ ఇండ‌స్ట్రీ ఈ ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేయాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. ఛాలెంజ్‌ను స్వీక‌రించి ముందుకు వెళ‌దాం. మంచి.. గొప్ప సినిమాల‌ను మ‌న ప్రేక్ష‌కుల కోసం రూపొందిస్తాం. బ్ర‌హ్మాస్త్రం సినిమా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఓ బ్ర‌హ్మాస్త్రం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments