Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యపై ఇనయా ప్రేమ.. ఓవరాక్షన్.. ప్లేటు లేకపోతే తినదట..

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (16:03 IST)
బిగ్ బాస్ సీజన్ ఆరో సీజన్ మరింత ఆసక్తిగా సాగుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో ఈసారి అన్ని ఫిజికల్ టాస్కులే ఇస్తున్నాడు బిగ్ బాస్. గురువారం ఎపిసోడ్ లో ఏకంగా డైరెక్ట్ గా కంటిస్టెంట్స్ కొట్టేసుకున్నారు. గత ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విడగొట్టి కర్రలు ఇచ్చి కొట్టుకోమన్నాడు. 
 
గురువారం ఎపిసోడ్ లో ఏకంగా డైరెక్ట్ గా కొట్టేసుకున్నారు. గురువారం ఎపిసోడ్ లో ముందుగా మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ అని ఆకాశంలోంచి గ్రానైట్స్ పడతాయి. వాటిని ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ టీం విన్ అయినట్టు. ఈ టాస్క్ లో ఒకరి మీద ఒకరు పడిపోయి మరీ, ఒకరి దగ్గర్నుంచి ఒకరు లాక్కొని హౌజ్ లో నానా హంగామా చేశారు.
 
ఇక గురువారం హౌస్ లో ఇనయా కాసేపు ఓవరాక్షన్ చేసింది. తినేముందు ఫైమాకి ఆకలి లేదు, తినను అని చెప్పింది. మళ్ళీ తినే సమయానికి వచ్చి సూర్య ప్లేట్ కనపడలేదు, నేను దాంట్లో తింటున్నాను అని తెలుసు కదా అని హడావిడి చేసింది. సూర్య ప్లేట్ లేకపోతే నేను తినను అని మారాం చేసింది. 
 
కొంతమంది సెటైర్స్ వేస్తే కీర్తి, వాసంతిలు తినిపించడానికి ట్రై చేశారు. సూర్య మీద అంత ప్రేమ ఉంటే సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయి సూర్య వాళ్ళింట్లో కూర్చో అని శ్రీసత్య కౌంటర్ ఇచ్చింది. 
 
శ్రీహాన్ కూడా ముందేమో ఆకలి లేదు తినను అని ఇప్పుడేమో సూర్య ప్లేట్ లేదు తినను అంటున్నావు, డ్రామాలు చేస్తున్నావు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక చివర్లో బ్లూ, రెడ్ టీమ్స్ డైరెక్ట్ గా కొట్టుకున్నారు. దీంట్లో రేవంత్ కంటికి గాయమైంది. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments