Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ గీతంలో భ‌జ‌గోవిందం..ప‌దం రావ‌డం నా త‌ప్పిద‌మే- కేసు ప‌రిష్కార‌మైందిః వై.యుగంధర్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (13:56 IST)
Y. Yugandhar
హీరోహీరోయిన్లుగా కొత్త‌వారితో తీసిన సినిమా `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు. చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మించారు. ఈ సినిమాను ఆగ‌స్టు 6న విడుద‌ల చేస్తున్నట్లు ద‌ర్శ‌కుడు తెలియ‌జేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, చిత్ర వివాదంపై స్పందించారు. సినిమాలో ఓ గీతంలో భ‌జ‌గోవిందం.. అనే ప‌దం ఒక‌టి వ‌చ్చింది. ఎడిటింగ్ లో దాన్ని మిస్ చేశారు. కావాల‌ని పెట్టిందికాదు. రొమాంటిక్ గీతంలో ఇలా రావ‌డం నా త‌ప్పిద‌న‌మే. దీనిపై హిందువుల విశ్వాసాలను గాయపరిచార‌ని కొంద‌రు కేసు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది. కేసు పెట్టిన‌వారికి ఆ ప‌దం ఎలా వ‌చ్చిందో, స‌న్నివేశం ఏమిటో వివ‌రిస్తూ వారికి ఆ గీతాన్ని కూడా చూపించాను. అని ద‌ర్శ‌కుడు యుగంధ‌ర్ క్లారిటీ ఇచ్చారు.
 
హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. కొత్త‌వారైనా క‌థ ప‌రంగా బాగా న‌టించారు. కోవిడ్ ముందే సినిమా పూర్త‌యింది. థియేట‌ర్లు లేక‌పోవ‌డంతో ఇప్ప‌టికి విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌మోష‌న్‌లో భాగంగా యూత్‌ను ఆక‌ట్టుకునేందుకే పోస్ట‌ర్లు, టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. సినిమాలో అవి ప్రాధాన్య‌త‌లేనివి. అస‌లు క‌థ‌, త‌ల్లిదండ్రుల‌కు, యువ‌త‌కు సంబంధించింది. ద‌ర్శ‌కుడిగా నాకిది తొలి చిత్రం. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక పెద్ద సంస్థ నాకు ఆఫ‌ర్ చేసింది అని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments