Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌రుడు కోసం - నాపగడ్డి సేలగాడ నాకేట్టి పనిరో. అంటోన్న రీతూవ‌ర్మ‌

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (13:35 IST)
Rituvaram
‘‘నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో-   నాపగడ్డి సేలగాడ  నాకేట్టి పనిరో....‘‘ అనే సాహిత్యం తో సాగే గీతాన్ని రీతూవ‌ర్మ‌పై చిత్రించారు. గీత రచయిత అనంత శ్రీరామ్ రచించారు. ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్  వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య చిత్రీకరించిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు.. సంగీతం, సాహిత్యం, నృత్యాలు  ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది.
 
‘వరుడు కావలెను‘ నుంచి ‘నాగ శౌర్య , రీతువర్మ’ ల ఫోక్ గీతంను బుధ‌వారంనాడు విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్. ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది.
 
కాగా, ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన '‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా' పాట బహుళ ప్రజాదరణ పొందింది. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు, వీడియోలు వంటి ప్రచారాలకు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. 
ఇంకా ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, పమ్మి సాయి, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్,  నిర్మాత: సూర్య దేవర నాగవంశి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments