Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకుంటోన్న ఆనంద్ దేవ‌ర‌కొండ హైవే- కాన్సెప్ట్ పోస్ట‌ర్స్‌

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (16:19 IST)
HIgh way poster
ఇటీవ‌ల పుష్ప‌క విమానం సినిమాతో మంచి విజ‌యం సాధించిన ఆనంద్‌ దేవరకొండ తాజాగా `హైవే` చిత్రం చేస్తున్నారు. కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌లో ఉన్నాయి. మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. 
 
చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ, 118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ గారి ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ, మాన‌స రాధా కృష్ణ‌న్ హీరో హీరోయిన్లుగా హైవే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్ట‌ర్స్ అభిషేక్ బెన‌ర్జి, స‌యామీఖేర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మా బ్యాన‌ర్లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెర‌కెక్కించాం. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు చివ‌రిదశ‌లో ఉన్నాయి అన్నారు.
 
చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ, ఒక‌రితో ఒక‌రికి సంభంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థే `హైవే’. పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుంది అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments