Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ కోసం వచ్చిన అఘోరాలు.. నేనే షాకయ్యానన్న బాలయ్య

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (15:59 IST)
బాలయ్య నటించిన అఖండ సినిమాను చూసేందుకు అఘోరాలు తరలివచ్చారు. ఇప్పటికే అఖండ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. బాలయ్య అఘోర రూపం చూసి ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులే కాదు.. శనివారం కొందరు అఘోరాలూ సినిమా చూసేందుకు వచ్చారు.
 
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో సందడి చేశారు. అఘోరాలూ బాలయ్య ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు కేకలేశారు. సినిమా అనంతరం బాలయ్య అభిమానులతో అఘోరాలు కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
ఇకపోతే.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఘన విజయం సాధించింది. సినిమా విడుదలైన తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టింది. 
 
మరోవైపు ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌పై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు భక్తిని రామారావు బతికించారని, ఇప్పుడు భక్తిని 'అఖండ' బతికించిందని చెప్పారు. 'అఖండ' సాధించిన విజయం మొత్తం సినీ పరిశ్రమ విజయమని బాలయ్య చెప్పారు. 
 
తెరపై తన నటనను చూసి తానే కాస్త ఆశ్చర్యపోయానని అన్నారు. తాను కేవలం తన దర్శకుడి సూచనలను పాటిస్తానని... తనకు ప్రతి సినిమా సమానమేనని చెప్పారు. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం అద్భుతమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments