Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనంలోని మజాను ఎంజాయ్ చేస్తున్నా : ఇలియానా

గోవా నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ ఇలియానా. ఈ గోవా బ్యూటీ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది.

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:44 IST)
గోవా నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ ఇలియానా. ఈ గోవా బ్యూటీ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది.
 
దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇలియానా మాత్రం ధీటుగానే సమాధానమిస్తూ సహజీవనం చేస్తోంది. దీనిపై 'మిడ్ డే' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోమారు స్పందించారు. ఆండ్రూ తనకు ప్రత్యేకమైన వ్యక్తి అని... ప్రస్తుతానికి తాము సహజీవనంలో ఉన్నామని, సహజీవనం చేస్తూ జీవితాన్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. పైగా, పెళ్లికి, సహజీవనానికి మధ్య ఉన్న తేడా చాలా చిన్నదే అని తెలిపింది.
 
సినీ పరిశ్రమలో 11 ఏళ్లుగా కొనసాగుతున్న తాను... అకారణంగా ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నానని ఇల్లీ చెప్పింది. తాము చేసే వ్యాఖ్యలు కూడా కొన్ని సార్లు వివాదాస్పదం అవుతుంటాయని... ఇలాంటి ఇబ్బందుల్లోకి ఆండ్రూనిలాగడం తనకు ఇష్టం లేదని తెలిపింది. అతని గురించి తరచూ మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని... అతనొక సాధారణ వ్యక్తి అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments