Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కట్టుకున్న భర్త తండ్రితో వివాహేతర బంధం... ఇంటి నుంచి పరార్... 40 రోజుల పాటు జల్సా...

మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ఇంటికొచ్చిన కోడలిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన మామ.. ఏకంగా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగని అతను.. ఏకంగా ఆమెతో ఇంటినుంచి పారిపోయాడు.

Advertiesment
Illegal relationship
, ఆదివారం, 2 జులై 2017 (09:41 IST)
మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ఇంటికొచ్చిన కోడలిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన మామ.. ఏకంగా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగని అతను.. ఏకంగా ఆమెతో ఇంటినుంచి పారిపోయాడు. అలా 40 రోజుల పాటు జల్సాలు చేసి.. చివరకు జీవించేందుకు డబ్బులు లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఖమ్మంజిల్లా రగునాథపాలెం మండలం మంచుకొండ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన అనిత(23)ను నాలుగేళ్ల కిత్రం ఖమ్మం జిల్లాకు చెందిన బాణోత్‌ వీరన్న కుమారుడు శ్రీకాంత్‌తో పెళ్లి జరిగింది. కాపురం సజావుగా సాగుతున్న సమయంలోనే కోడలిపై మామ వీరన్న కన్నేసి, ఆమెను లొంగదీసుకున్నాడు. రెండేళ్లుగా వీరిద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. చివరకు ఈ విషయం భర్తతో పాటు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో భర్త తగదని చెప్పి హెచ్చరించాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. 
 
తమ గుట్టు బయటపడటంతో ఎటైనా వెళ్లి బతుకుదామని కోడలికి చెప్పడంతో ఆమె అంగీకరించింది. రూ.లక్ష నగదు, మరో లక్ష డబ్బున్న ఏటీఎం కార్డుతో పారిపోయారు. మే 19న అనిత కనిపించట్లేదని డోర్నకల్‌ పోలీసుస్టేషన్‌లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అనుమానంతో వీరన్న బ్యాంకు లావాదేవీలను కుటుంబసభ్యులు నిలిపివేయించారు. 
 
దీంతో తమ వద్ద ఉన్న డబ్బుతోనే 40 రోజుల పాటు ఇద్దరూ గడిపారు. డబ్బులు అయిపోవటంతో శుక్రవారం ఇంటిముఖం పట్టారు. ఇంటికి వెళితే క్షమించరనే భయంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమవద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను ఓ దుకాణంలో పెట్టి రూ.2500 తీసుకున్నారు. పురుగుల మందు, ఎలుకల మందు, మద్యం, బ్లేడ్‌లను కొనుగోలు చేశారు 
 
ఇద్దరూ శుక్రవారం మంచుకొండ వద్దకు వెళ్లి, అక్కడ మద్యం, ఎలుకల మందు తాగి బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ బ్లేడ్‌లతో మణికట్టు కోసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న వారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా, వారు అక్కడకు వచ్చి తీవ్ర రక్తస్రావమైన వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ శనివారం అనిత మృతి చెందింది. వీరన్న ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
 
కాగా, చనిపోయేముందు అనిత తల్లిదండ్రులకు ఓ లేఖ రాసిపెట్టింది. 'జీవితానికో అర్థం ఉందని, బతికే విధానం ఉంటుందని తెలుసుకోలేక పోయాను. బతికే అర్హత నాకులేదు. చచ్చిపోవటం తప్ప నాకు వేరే దారిలేదు. నాన్నా.. నన్ను క్షమించు, ఎవరూ చేయకూడని పని చేశాను' అంటూ నోట్‌రాసి కన్నుమూసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో 1.5 కిలోల బంగారం, రూ.8 లక్షలతో పట్టుబడ్డ శాండి(వీడియో)