Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్షు- ద‌ర్శ‌కురాలి ద్వితీయ చిత్రం ప్రారంభం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (17:05 IST)
VV Rushika, Sai Karthik, Ram Agnivesh
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన 'ఇక్షు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో రెండో సినిమాను మొదలెట్టారు. 'ఇక్షు' చిత్రానికి దర్శకత్వం వహించిన వి వి రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమ‌యింది. ఈ సందర్బంగా చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి  'ఎంఎల్ఏ' ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి ఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ కు చిత్ర దర్శకురాలు రుషిక గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం కో ప్రొడ్యూసర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ, దసరా సందర్బంగా ఈ రోజు పూజతో మొదలు పెట్టాం. ఇది ఓ మిడిల్ క్లాస్ జీవితాలలో జరిగే కథ. ముఖ్యంగా తండ్రి, కొడుకు నేపథ్యంలో సాగుతుంది. ఇక్షు చిత్రానికి అద్భుతంగా దర్శకత్వం వహించిన రుషిక గారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా తరువాత ప్రారంభిస్తాం" అన్నారు. 
 
నిర్మాత హనుమంత్ రావు నాయుడు మాట్లాడుతూ, మా బ్యానర్ లో ఇది రెండో సినిమా. మేము నిర్మించిన మొదటి సినిమా ఇక్షు సినిమాను తెరకెక్కించిన విధానం బాగా నచ్చడంతో అదే దర్శకురాలితో రెండో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది" అన్నారు. 
 
దర్శకురాలు వి.వి. రుషిక మాట్లాడుతూ, తెలుగులో మ‌హిళా దర్శకులు చాలా తక్కువ అందులో నేను తీసిన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే రెండో సినిమాకు అవ‌కాశం రావడం ఆనందంగా వుంది. ఈ వారంలో మిగతా నటీనటులను ఎంపిక చేస్తాం. అలాగే ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్న రామాగ్నివేశ్ లో ప్ర‌తి వుంది. ఇక్షులో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ కథ గురించి చెప్పాలంటే త‌ల్లితండ్రులు, పిల్లల మధ్య జరిగే సన్నివేశాలతో ఉంటుంది. ఈ సినిమా చుస్తే చాలా మందికి కొన్ని సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. అంతలా ఎమోషన్, కామెడీ, ఫ్యామిలీ, అన్ని అంశాలు ఉన్న సినిమా ఇది.  అలాగే ఈ సినిమాకు సపోర్ట్ అందిస్తున్నారు కార్తీక్ అలాగే టీం అందరికి థాంక్స్ అన్నారు. హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ .. ఈ బ్యానర్ లో నా రెండో చిత్రమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments