Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వకుండా ఉంటే లక్ష బహుమతి : రాజయోగం చిత్రబృందం

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (15:54 IST)
Sai Ronak, Ankita Saha, Ram Ganapathy, Thagubothu Ramesh,Sakalaka Shankar
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా "రాజయోగం" . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు. దర్శకుడు రామ్ గణపతి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ...మా సినిమాకు థియేటర్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోకుండా చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది నా మొదటి సినిమా అయినా, అనుభవజ్ఞుడైన దర్శకుడిలా తెరకెక్కించానని అనే ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా సినిమా చూడని వారు త్వరగా చూసేయండి. ఎంత మంచి సినిమా అయినా మూడు రోజులకు మించి థియేటర్లలో ఉంచడం లేదు. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే వాళ్ళకు లక్ష రూపాయల బహుమతి ఇస్తాం అని మా నిర్మాతలు ప్రకటించారు అంటే మాకెంత నమ్మకమో మీరు అర్థం చేసుకోండి అన్నారు.
 
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ...సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మేము పడిన కష్టానికి ఫలితం దక్కింది అనిపిస్తోంది. అయితే నా కంప్లైంట్ ఒక్కటే. మంచి చిత్రానికి కూడా థియేటర్స్, షోస్ దొరకడం లేదు. ప్రేక్షకులు చూడాలని అనుకున్నా, ఆ టైమ్ కు షోస్ ఇవ్వకుంటే ఎలా చూస్తారు. నా లాంటి కొత్త హీరోలు, దర్శకులు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చాం. చేసిన మంచి సినిమాలకైనా థియేటర్ల పరంగా సపోర్ట్ దొరక్కుంటే ఎలా. రాజయోగం లాంటి మంచి చిత్రాలను ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
 
నాయిక అంకిత సాహా మాట్లాడుతూ...రాజయోగం థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కాబట్టి చూడని వారు తప్పకుండా వెళ్లండి. ఓటీటీలో వచ్చేవరకు వేచి చూడకండి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మా సినిమా మీకు కావాల్సినంత వినోదాన్ని ఇస్తుంది. అని చెప్పింది.
 
నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ...దర్శకుడు రామ్ గణపతి యాక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి ప్రేక్షకులు ఇష్టపడే అంశాలతో సినిమాను రూపొందించాడు. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. అందుకే విదేశాల్లో పనిచేసే కెరీర్ వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాడు. మంచి ప్యాడింగ్ ఉన్నారు. నేనూ శకలక శంకర్ సినిమాకు ఫన్ తీసుకొచ్చాం. అన్నారు.
 
నటుడు శకలక శంకర్ మాట్లాడుతూ...రాజయోగం చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రామ్ గణపతి తెరకెక్కించాడు. ఇటీవల ఓ పెద్ద మనిషి గాలివాటానికి సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అయిపోతారు అని అన్నాడు. అది తప్పు. ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేం. ఆయన ఎందుకు ఆ మాటలు అన్నాడో ఆలోచించుకోవాలి. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments