Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయి రోనక్‌ రాజయోగం ఎలా ఉందంటే! రివ్యూ

Rajayogam poster
, శుక్రవారం, 30 డిశెంబరు 2022 (13:47 IST)
Rajayogam poster
నటీనటులు: సాయి రోనక్‌, అంకిత సాహా, బిస్మి నాస్‌, అజయ్‌ ఘోష్‌, ప్రవీణ్‌, గిరి, భద్రం, షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్‌ తదితరులు
 
సాంకేతికత: రచన దర్శకత్వం: రామ్‌ గణపతి, నిర్మాత: మణి లక్ష్మణ్‌రావు, సహ నిర్మాతలు: డాక్టర్‌ శ్యామ్‌ లోహియా, నందకిషోర్‌ దారక్‌ సినిమాటోగ్రఫీ: విజయ్‌ సీ కుమార్‌ ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌ సంగీతం: అరుణ్‌ మురళీధరన్‌ డైలాగ్స్‌: చింతపల్లి రమణ పీఆర్వో: జీఎస్కే మీడియా బానర్‌: శ్రీ నవబాలా క్రియేషన్స్‌, వైష్ణవి నటరాజ్‌ ప్రొడక్షన్స్‌. రిలీజ్‌ డేట్‌: డిసెంబర్‌ 30.
 
ఐదేళ్ళ నాడు ఇ.ఈ.. (ఇతడు, ఈమె) అనే సినిమాను తీసిన రామ్‌ గణపతి మళ్ళీ రెండో ప్రయత్నంగా చేసిన సినిమానే రాజయోగం. టైటిల్‌కు తగినట్లుగానే ఈ సినిమా వుంటుందనీ, యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని వారికోసమే ఈ సినిమా తీశానని చెబుతున్న దర్శకుడు ఇందులో దాదాపు వందకుపైగా ముద్దు సన్నివేశాలున్నాయి తెలిపారు. అవికూడా సెన్సార్‌ వారు చూసి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, అంతా కథ ప్రకారమే తీశామని చెబుతున్న ఈ ఈ సినిమాలో అసలేం వుందో చూద్దాం.
 
కథ:
 
రిషి (సాయి రోనక్‌) మెకానిక్‌. మథ్యతరగతివాడు. అందుకే సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొంటే జీవితం సెటిల్‌ అవుతుందని కలలు కంటుంటాడు. ఓ రోజు కారును డెలివరీ  ఇవ్వడానికి  ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కి వెళ్తాడు. అక్కడ శ్రీ (అంకిత సాహా)శ్రీ ని  చూడగానే ప్రేమపుడుతుంది. ఒకరోజు తనను బయటకు తీసుకెళ్ళి సర్ప్రైజ్‌ చేస్తాడు. దాంతో రిషిని ప్రేమించడం మొదలు పెడుతుంది. దాంతో వీరుద్దరు ఒక నైట్‌ ఒక్కటవుతారు. తన కల నిజమైంది అనుకున్న రిషికి మరుసటి రోజు శ్రీ వచ్చి ఊహించని ట్విస్ట్‌ ఇస్తుంది. రిషికి బ్రేకప్‌ చెప్పి డ్యానియల్‌ (సిజ్జు ) దగ్గర  ఉన్న 50 వేల కోట్ల వజ్రాన్ని చేజిక్కుంచుకోవాలని తిరిగే రాధా (అజయ్‌ ఘోష్‌) కు దగ్గరవుతుంది. డబ్బు కంటే ప్రేమ ముఖ్యమని శ్రీ కు తెలిసేలా  మంచి గుణపాఠం నేర్పాలని రిషి ప్లాన్‌ చేస్తాడు. శ్రీ నిజమైన కోటేశ్వరురాలా కాదా? శ్రీ కి రిషి ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఈ వజ్రాలకు ఐశ్వర్య  అనే అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి?  రిషి కి  డైమండ్‌ దక్కుతుందా లేక ప్రేమ దక్కుతుందా..చివరకు ఆ వజ్రం ఎవరికీ దొరికింది? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ: 
దర్శకుడు పనితీరు, కోట్లాది రూపాయల వజ్రాలను దక్కించుకోవాలని ప్లాన్‌ చేసిన రెండు ముఠాల మధ్య ఇద్దరు ప్రేమికులు ఇరుక్కుపోవడం అనే పాయింట్‌ను దర్శకుడు రామ్‌ గణపతి కథగా విస్తరించిన విధానం బాగుంది. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ తొలి భాగం ఫుల్లుగా నాటు కామెడీ.. అలాగే మోతాదుకుమించి శంగారం, రొమాన్స్‌తో గిలిగింతలు పెట్టారు. ఫస్టాఫ్‌లో అజయ్‌ ఘోష్‌, చిత్రం శ్రీను గ్రూప్‌ కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఇక హీరో సాయి రోనక్‌, అంకిత సాహా మధ్య ఉన్న శంగార సన్నివేశాలు ఫుల్లుగా ఓవర్‌డోస్‌ అని చెప్పవచ్చు. మంచి ఎమోషనల్‌ ట్విస్టుతో ఫస్టాప్‌ను ముగించి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు.
 
రిషి పాత్రలో నటించిన హీరో సాయి రోనక్‌ . డ్యాన్సులు ఫైట్స్‌, రొమాన్స్‌, లిప్‌ లాక్‌ సీన్స్‌, కామెడీ ఇలా అన్ని చాలా బాగా నటించి మెప్పించాడు. ఇప్పటివరకు  సాయి రోనక్‌ చేసిన సినిమాలకు భిన్నంగా  ఇందులో ఫస్ట్‌ టైం యాక్షన్‌ సన్నివేశాలలో  బాగా ఎక్స్‌ పోజ్‌ చేశాడు. హీరోయిన్‌ అంకిత సాహా బాంబే నుంచి వచ్చిన అమ్మాయి అయినా లిప్‌ లాక్‌, రొమాన్స్‌ చేసే విషయంలో ఏ మాత్రం  సిగ్గుపడకుండా తన అందాన్ని, అభినయాన్ని ప్రదర్శించి అందరినీ కవ్వించింది. సెకెండ్‌ లీడ్‌ రోల్‌ లో నటించిన  కేరళ  కుట్టి బిస్మి నాస్‌ కూడా ఐశ్వర్య పాత్రలో చాలా ఇన్నోసెంట్‌ పాత్రలో నటించి మెప్పించింది. కామెడీ సీన్స్‌ లలో షకలక శంకర్‌ తాగుబోతు రమేష్‌, మధు నందన్‌, అజయ్‌ ఘోష్‌, గిరిధర్‌, ప్రవీణ్‌, భద్రం, చిత్రం శ్రీను  నెమలి శ్రీను వంటి వారితో సరదా సన్నివేశాలను తీసి చాలా కాలం తరువాత ప్రేక్షకులను బాగా నవ్వించారు. అజయ్‌ ఘోష్‌ పాత్ర హైటైల్‌. నటించిన సిజ్జు చాలా బాగా నటించాడు. క్లైమాక్స్‌ లో వజ్రం  ను దక్కించుకోవడానికి  సిజ్జు, అజయ్‌ ఘోష్‌, లు పడే తపన  పోలీస్‌ క్యారెక్టర్‌ లో జీవించేసిన తాగుబోతు రమేష్‌, షకలక శంకర్‌ ల కామెడీ, వీరందరితో కలసి  సాయి రోనక్‌ ల మధ్య సాగే క్లైమాక్స్‌ కామెడీ బాగా నవ్విస్తుంది.
 
స్టార్‌ హోటల్‌ లో  స్టే చేసే నాలుగు రోజుల్లో వాళ్ళ లైఫ్‌ ఎలా టర్న్‌ అయింది అనేటటువంటి ఒక ఇంట్రెస్టింగ్‌ కలిగించే రొమాంటిక్‌ క్రైం కామెడీ కథను ఎంచుకుని యూత్‌ కి బాగా కనెక్ట్‌ అయ్యే విధంగా చాలా చక్కగా తెరకెక్కించాడు. తక్కువ బడ్జెట్‌ లో చాలా రిస్క్‌ తీసుకొని చాలా బాగా చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అరుణ మురళీధరన్‌ అందించిన సంగీతం బాగుంది. సిధ్‌ శ్రీరామ్‌ తో పాడిన రాసి పెట్టి ఉన్నట్టుందే, రాజయోగం వచ్చేసిందే అనే  రొమాంటిక్‌ సాంగ్‌  బాగుంది. సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ సి కుమార్‌ కెమెరా పని తనం అద్భుతం అని చెప్పవచ్చు. పాల్‌ ప్రవీణ్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌  స్కోర్‌ బాగుంది. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ పని తీరు బాగుంది, చింతపల్లి రమణ ఇచ్చిన మాటలు పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఈ సినిమా ఎమోషన్స్‌ తో పాటు  రొమాంటిక్‌ సీన్స్‌ కు యూత్‌ కనెక్ట్‌ అవుతారని కచ్చితంగా చెప్పవచ్చు.
రేటింగ్‌: 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్‌ 5 నో ఎగ్జిట్‌ ఎలా వుందంటే! రివ్య్వూ