బిగ్ బాస్‌లో మళ్లీ అవకాశం వచ్చినా వెళ్లను, నా సర్వం కోల్పోయా: శివజ్యోతి షాకింగ్ కామెంట్స్

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (15:59 IST)
బిగ్ బాస్-3 సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. బిగ్ బాస్ ఎపిసోడ్ల కోసం జనం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. టీవీలకు అతుక్కుని పోతున్నారు. అయితే 14వ వారాన్ని దాటడంతో ఒకింత టెన్షన్ ప్రజల్లో మరింత పెరిగింది. ఎవరు విజేతగా నిలుస్తారన్నదే ఇప్పుడు అందరిలోను మెదులుతున్న ప్రశ్న.
 
అయితే తాజాగా శివజ్యోతి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్-3 నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన శివజ్యోతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తెలంగాణా యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే శివజ్యోతి తాను ఎలిమినేట్ కావడాన్ని లైట్ తీసుకుంటోంది. నేను అందరితో మంచిగా ఉండటంతోనే 14 వారాల పాటు బిగ్ బాస్-3లో ఉండగలిగాను.
 
ఇది నన్ను అభిమానించే వారందరికీ తెలుసు. నేను హౌస్‌ను మిస్ అవుతానన్న బాధ ఉంది. స్నేహితులందరినీ వదులుకున్నాను. ఆ బాధ ఉంది. అయితే బిగ్ బాస్-3 హౌస్ లోకి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డా. కుటుంబాన్ని మిస్సవుతున్నానన్న బాధ నాలో అలాగే ఉండేది. కానీ మూడు వారాలు దాటిన తరువాత హౌస్‌లోని వారే నా కుటుంబ సభ్యులు అయిపోయారు. అయితే నేను బయటకు వచ్చాను. వీళ్ళే గెలవాలి అని ఒకరినే నేను చెప్పలేను. 
 
నేను బయటకు వచ్చేశా కాబట్టి ఎవరు గెలిచినా నాకు అనవసరం. బిగ్ బాస్-3 నాకు మంచి స్నేహితులనిచ్చింది. నా అభిమానులను నాకు మరింత దగ్గర చేర్చింది. అది చాలంటోంది శివజ్యోతి. ఇక యధావిధిగా తన జాబ్‌లో కొనసాగుతానంటోంది. బిగ్ బాస్ -3ని వదిలి బయటకు వచ్చినప్పుడు ఏమి అనిపించలేదు.. కానీ అభిమానులందరూ కనిపించచోటల్లా అడుగుతుంటే మాత్రం సర్వం కోల్పోయినంత బాధ నాలో ఉందంటోంది శివజ్యోతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments