Webdunia - Bharat's app for daily news and videos

Install App

Deepika: ప్రభాస్ తో లిప్ లాక్ చేయనని స్పిరిట్ వద్దన్నా : దీపికా పదుకొనె

దేవీ
గురువారం, 29 మే 2025 (10:15 IST)
Deepika- Sandeep reddy
సందీప్ రెడ్డి వంగా, దీపికా పదుకొనే పోస్ట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒకరికొకరు విమర్శించుకోవడం విశేషం. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో దీపికాను చేయమని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అడిగారు. దానికి దీపిక వెంటనే కథ వింటానని చెప్పింది. కథ వింటుండగా ఐదు నిముషాల సీన్ లో ప్రభాస్ తో లిప్ లాక్ చేయాలని అడిగారు. దానిని జీర్ణించుకోలేకపోయాక. ఆ తర్వాత నేను సినిమా చేయనని చెప్పానని.. దీపిక సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.
 
Deepika post
సో, ఆ తర్వాత ఆమె ప్లేస్ లో నటి త్రిప్తి దిమ్రీని ఎంపికచేశారు. అయితే ఈ సందర్భంగా సందీప్ వంగా టీమ్ మరోకోణంలో దీపిక గురించి వెల్లడిస్తూ పోస్ట్ చేసింది. ప్రారంభంలో దీపికా పదుకొనే స్పిరిట్‌లో పాత్రను అంగీకరించిందని, దీనిని సందీప్ రెడ్డి వంగా రాసిన ఉత్తమ రచనలలో ఒకటిగా అభివర్ణించిందని మీడియాకూ నివేదించింది.
 
అయితే, దీపిక 8 గంటల షూటింగ్ రోజులు చేసింది. ఆమెకు తెలుగు మాట్లాడటం రాదు, భారీ 30–40 కోట్ల ఫీజుతోపాటు లాభాల వాటా వంటి అనేక డిమాండ్లను చేసినప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇవి మా టీమ్ ను దిగ్భ్రాంతికి గురి చేశాయి. అందుకే తాము ఆమెను ప్రాజెక్ట్ నుండి తొలగించాం.
 
ఆ తర్వాత దీపిక.. వంగాకు వ్యతిరేకంగా భావోద్వేగ కథనాలను ఉపయోగించి సానుభూతి కార్డును ప్లే చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత, వంగా అధికారికంగా త్రిప్తి దిమ్రీని ప్రధాన పాత్రగా ప్రకటించారు. అప్పుడు దీపిక పిఆర్ ఒకప్పుడు ప్రశంసించినప్పటికీ, ఆ పాత్రలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని,  స్క్రిప్ట్‌లోని కొన్ని భాగాలను కూడా లీక్ చేస్తున్నారని చెబుతూ త్రిప్తిని లాగడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. దీపిక ఇష్యూకు త్వరలో ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రముఖులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

సహజీవనం చేసిన మహిళను కాల్చి చంపిన కాంట్రాక్టరు

కొడుకును చంపేసి మూటకట్టి మూసీలో పడేసిన తండ్రి!!

మాజీ ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య

ఆటో డ్రైవర్లకు దసరా కానుక... వాపాప మిత్ర కింద రూ.15 వేలు ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

తర్వాతి కథనం
Show comments